🛑LIVE BREAKINGS: తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం

author-image
By Prasanth Reddy
New Update
BREAKING NEWS

  • Dec 09, 2024 20:14 IST
    తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించిన ప్రభుత్వం

    తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటూ ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను జరపాలని నిర్ణయించింది. దీన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా జరుపుకోవాలని తెలిపింది.

    TELANGANA TALLI

    Also Read : https://rtvlive.com/telangana/telangana-talli-statue-has-been-officially-approved-by-the-govt-8404025



  • Dec 09, 2024 18:44 IST
    పవన్‌ కళ్యాణ్‌ను చంపేస్తాం.. వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు!

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌ను చంపేస్తామంటూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

    Deputy CM Pawan Kalyan

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/stranger-threatening-to-kill-deputy-cm-pawan-kalyan-8378419



  • Dec 09, 2024 18:26 IST
    తండ్రి కాబోతున్న చెన్నై సూపర్ కింగ్స్‌ ఓపెనర్.. ఫ్యాన్స్‌కు పండగే!

    న్యూజిలాండ్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య కిమ్ ఈ వారంలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే ఇంగ్లండ్‌తో సిరీస్‌లోని మూడవ, చివరి టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

    Devon Conway

    Also Read : https://rtvlive.com/sports/devon-conway-to-miss-third-nz-eng-test-due-to-birth-of-first-child-8355746



  • Dec 09, 2024 17:42 IST
    ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్ర

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌గా సంజయ్ మల్హోత్ర నియామకం అయ్యారు. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు.

    SANJAY Malhotra

    Also Read : https://rtvlive.com/national/sanjay-malhotra-appointed-as-new-rbi-governor-8353447



  • Dec 09, 2024 17:36 IST
    జీవో 46పై విచారణ.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

    పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించికి బాధితులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే పోస్టుల భర్తీ విషయంలో చూపించిన విధానంపై కౌంటర్ ఫైల్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

    Supreme Court

    Also Read : https://rtvlive.com/telangana/key-turning-point-in-supreme-court-on-go-46-petition-8343273



  • Dec 09, 2024 17:29 IST
    రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

    మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. ఈ విషయంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ మనోజ్, మోహన్ బాబు మధ్య రాజీ కుదుర్చాలని ప్రయత్నాలు చేయగా విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో మంచు లక్ష్మి తిరిగి ముంబై వెళ్లిపోయారట.

    lakshmi

    Also Read : https://rtvlive.com/cinema/manchu-family-dispute-manchu-lakshmi-return-to-mumbai-again-telugu-news-8343228



  • Dec 09, 2024 17:04 IST
    అదంతా ఫేక్.. వారిపై కేసు వేస్తా: జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో!

    జానీ మాస్టర్ సంచలన వీడియో రిలీజ్ చేశారు. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తనను ఎవరూ తొలగించలేదన్నారు. తన పదవీ కాలం ఇంకా ఉన్నా అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించారన్నారు. ఎన్నికలకు కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తానని తెలిపారు.

    Jani Master.

    Also Read : https://rtvlive.com/cinema/johnny-master-video-released-on-dancers-and-dance-directors-association-8340262



  • Dec 09, 2024 16:53 IST
    సిరియాలో అసద్ పాలన అంతం వెనుక 14 ఏళ్ల బాలుడి హస్తం..

    సిరియాలో 50 ఏళ్ల పాటు సాగిన అసద్‌ కుటుంబ పాలన అంతమైంది. అసలు సిరియాలో అంతర్యుద్ధం ఎలా మొదలైంది, అసద్ కుటుంబ పాలన ముగియడానికి గల కారణాల గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

    SYRIA WAR

    Also Read : https://rtvlive.com/international/how-a-syrian-teens-graffiti-triggered-president-al-assads-fall-13-years-ago-8326261



  • Dec 09, 2024 16:52 IST
    కేటీఆర్ కు మాతో పోల్చుకునే అర్హత లేదు.. భట్టి సంచలన కామెంట్స్!

    కేటీఆర్ కు తమతో పోల్చుకునే అర్హత లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ లేకుంటే కేటీఆర్ ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదంటూ సెటైర్స్ వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయని పనులు తాము ఏడాదిలో చేసి చూపించామని చెప్పారు. 

    కాళేశ్వరం ఇంజనీర్‌ కేసీఆరే.. కేసీఆర్‌ రాత్రి పూట డిజైన్‌ చేసి చెక్‌ డ్యాంలకు ప్లాన్‌ గీశారు: భట్టి విక్రమార్క

    Also Read : https://rtvlive.com/telangana/bhatti-vikramarka-shocking-comments-on-ktr-telugu-news-8293721



  • Dec 09, 2024 16:43 IST
    గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

    గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC తాజాగా రిలీజ్ చేసింది. ఈ పరీక్షల హాల్‌టికెట్లను TGPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

    group 2

    Also Read : https://rtvlive.com/telangana/group-2-hall-tickets-released-8326209



  • Dec 09, 2024 16:38 IST
    పుష్పగాడి బాక్సాఫీస్ జాతర.. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల దిశగా

    అల్లు అర్జున్ పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నాలుగు రోజుల్లో అత్యంత వేగంగా రూ. 829 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

    Also Read : https://rtvlive.com/cinema/allu-arjun-pushpa-2-box-office-wild-fire-four-days-world-wide-829-crores-collections-telugu-news-8326189



  • Dec 09, 2024 15:14 IST
    కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన.. పోలీసులతో వాగ్వాదం

    హైదరాబాద్ కోఠిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్స్‌డ్ జీతాలు డిమాండ్ చేస్తూ కోఠి డిఎంవి కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు. అడ్డుకున్న పోలీసులతో ఆశావర్కర్లు వాగ్వాదానికి దిగారు. వారిని అరెస్ట్ చేశారు.

    asha

    Also Read : https://rtvlive.com/telangana/agitation-of-asha-workers-in-koti-8292449



  • Dec 09, 2024 13:47 IST
    మంచు మనోజ్ కి పవన్ కళ్యాణ్ హై సెక్యూరిటీ

    మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ నేప‌థ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు వచ్చారు. ఈ క్ర‌మంలో మోహ‌న్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్స‌ర్లు చేరుకున్నారు. అయితే మనోజ్ ను సపోర్ట్ చేసేందుకు గబ్బర్ సింగ్ టీమ్ రంగంలోకి దిగింది.

    pawan 001

    https://rtvlive.com/cinema/pawan-kalyan-has-high-security-for-manchu-manoj-8285346



  • Dec 09, 2024 13:27 IST
    బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య

    బీజేపీ మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్‌.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. ఒడిశా నుంచి సుజిత్ కుమార్, హర్యనా నుంచి రేఖాశర్మ పేర్లను ప్రకటించింది.గతంలో ఆర్‌.కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేశారు.

    R Krishnayya

    https://rtvlive.com/andhra-pradesh/bjp-declares-r-krishnayya-name-as-rajyasabha-candidate-8283812



  • Dec 09, 2024 13:24 IST
    AP: ముంబై నటి జత్వాని కేసులో వైసీపీ నేతకు బెయిల్!

    ముంబై సినీ నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరైంది. కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం విచారించిన ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. 

    ereerer

    https://rtvlive.com/andhra-pradesh/jatwani-case-granted-bail-to-ycp-leader-kukkala-vidyasagar-telugu-news-8283737



  • Dec 09, 2024 13:15 IST
    సంధ్య థియేటర్ ఘటన.. బన్నీని సపోర్ట్ చేస్తూ RGV సంచలన ట్వీట్

    'పుష్ప2' మూవీ లిరీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై RGV రియాక్ట్ అయ్యారు. విషయంలో హీరో అల్లు అర్జున్‌ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయని గుర్తుచేశారు.

    rgv001

    https://rtvlive.com/cinema/sandhya-theater-incident-rgv-sensational-tweet-supporting-allu-arjun-8283735



  • Dec 09, 2024 12:40 IST
    TG News: ఆడపిల్ల పుట్టిందని ఊరంతా చీరలు పంచిన తండ్రి

    జగిత్యాల జిల్లా బీర్​పూర్ మండలం తుంగూరులో ఓగులపు అజయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. మహాలక్ష్మి పుట్టిందని ఊరిలోఉన్న ప్రతి మహిళకు చీరలను ఇంటింటికీ తిరుగుతూ తండ్రి పంపిణీ చేశారు. అజయ్‌ అలా పంచడానికీ రూ.30 కోట్ల లాటరీ తగటం కూడా ఓ కారణం ఉందట.

    baby.

    https://rtvlive.com/telangana/father-ajay-distributed-sarees-birth-of-a-baby-girl-in-tungur-of-jagityala-telugu-news-8283559



  • Dec 09, 2024 11:56 IST
    'పుష్ప 2' స్క్రీనింగ్‌ లో వింత ఘటన.. డైరెక్ట్ సెకండాఫ్ వేయడంతో ఆడియన్స్ షాక్

    'పుష్ప 2' స్క్రీనింగ్‌లో ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. కొచ్చిన్‌లోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్‌లో ‘పుష్ప 2’ స్క్రీనింగ్‌లో తొలి భాగం ప్రదర్శించకుండా సెకండాఫ్‌ వేశారు. ఆ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించలేకపోయారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

    pushpa2 001

    https://rtvlive.com/cinema/kochi-theatre-screens-pushpa-2-second-half-without-first-half-fans-demand-refund-8283401



  • Dec 09, 2024 10:55 IST
    తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత ఇదే.. అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి

    సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో సోమవారం ఉదయం 10. 30 కి అసెంబ్లీ సమావేశాలు మొదలైయ్యాయి. తెలంగాణ తల్లి ఏర్పాటుపై సీఎం అంసెబ్లీలో ప్రకటన చేశారు.

    CM O

    https://rtvlive.com/telangana/telangana-assembly-meetings-begin-8283362



  • Dec 09, 2024 10:20 IST
    ప్రపంచంలో రిచెస్ట్ బిచ్చగాడు ఇతనే.. 7.5 కోట్లకు అధిపతి

    యాభైనాలుగేళ్ల భరత్ జైన్ అనే భిక్షగాడికి 7 కోట్ల 50 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయి.  అయినా ఇప్పటికీ అతను భిక్షాటన చేస్తూనే జీవనం సాగిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా భరత్‌ జైన్‌ వార్తల్లో నిలిచాడు.

    begging

    https://rtvlive.com/viral/he-is-the-richest-of-the-beggars-8283195



  • Dec 09, 2024 09:24 IST
    నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్

    సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన స్టోరీలో తన పెట్ డాగ్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. నా కుక్క ప్రేమ కంటే మరే ప్రేమ గొప్పది కాదని క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్ట్ నాగ చైతన్యను టార్గెట్ చేసి పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    sam

    https://rtvlive.com/cinema/samantha-latest-post-going-hot-topic-in-social-media-8283133



  • Dec 09, 2024 08:53 IST
    Jani Master : జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్

    జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారు.

    jani001

    https://rtvlive.com/cinema/jani-master-permanently-removed-from-the-dancers-and-dance-directors-association-8283108



  • Dec 09, 2024 08:48 IST
    Assembly sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే సభలో రైతు భరోసా, సవరణ బిల్లులు, తెలంగాణ తల్లి విగ్రహం, రెవెన్యూ చట్టం, మహిళా వర్సిటీ బిల్లు వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం.

    Telangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిషికేషన్

    https://rtvlive.com/telangana/telangana-assembly-sessions-started-from-today-8283085



  • Dec 09, 2024 08:02 IST
    నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లకండి

    నేడు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహన్ని సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సోమవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అటుగా వెళ్లే వాహనాలను మల్లించనున్నారు.

    FuzJFSqWcAMPCUA

    https://rtvlive.com/telangana/traffic-restrictions-in-hyderabad-8283057



  • Dec 09, 2024 07:56 IST
    TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టీటీడీ ఈవో!

    టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు.

    TTD 2

    https://rtvlive.com/andhra-pradesh/ttd-additional-eo-surprise-inspection-in-laddu-counters-at-tirumala-8283053



  • Dec 09, 2024 07:30 IST
    విషాదం.. నవ వధువు ప్రాణం తీసిన హీటర్

    స్నానం కోసం పెట్టిన వాటర్‌లో చేయి పెట్టి హీటర్ తీయడంతో నవ వధువు షాక్ కొట్టి మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పెళ్లయి నాలుగు రోజులు కాకుండానే కొత్త పెళ్లి కూతురు మరణించడంతో భర్త, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

    water

    https://rtvlive.com/crime/telangana-manchiriyala-newly-married-woman-dies-after-getting-shocked-after-putting-her-hand-in-water-heater-8283039



  • Dec 09, 2024 07:08 IST
    అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

    తెలుగు రాష్ట్రాల శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సౌత్‌ సెంట్రల్ రైల్వే మరో 34 సర్వీసులను నడపనుంది. అయ్యప్ప భక్తులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.

    https://rtvlive.com/andhra-pradesh/scr-to-run-34-special-trains-for-sabarimala-devotees-through-ap-and-telangana-8283030



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు