ఇటీవల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై బయటికొచ్చిన టాలీవుడ్ అగ్ర కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే? ఆ పదవి నుంచి తొలగింపు.. ఈ అసోసియేషన్ కు సంబంధించి జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. 5వ సారి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాశ్ ఎన్నికయ్యారు. ఆదివారం డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ప్రకాష్ ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారు. ఈ ఎన్నికల్లో జానీ మాస్టర్ ఓటమికి ఇటీవల జరిగిన పరిణామాలే కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ కు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. అరెస్ట్ అవ్వకముందు ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా మేకర్స్ జానీ మాస్టర్ ను తప్పించి ఆయన ప్లేస్ లో మరొకర్ని తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ఇతర ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నాడు. Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ