తాజాగా డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి సంబంధించి జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రకాశ్ ఎన్నికతో జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. తనను ఈ అధ్యక్ష పదవి నుంచి తొలిగించడంపై జానీ మాస్టర్ తాజాగా స్పందించారు. Also Read: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్! అదంతా ఫేక్ న్యూస్ ఈ మేరకు రీసెంట్‌గా జరిగిన డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై జానీ మాస్టర్ వివరణ ఇచ్చారు. తనను డ్యాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలిగించారంటూ ఉదయం నుంచి ఓ వార్త వైరల్ అవుతోందని.. అయితే అదంతా ఫేక్ అని అన్నారు. దాన్ని ఎవరూ నమ్మొద్దని, తనను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు అని క్లారిటీ ఇచ్చారు. Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు! అదంతా ఫేక్ న్యూస్..! వారి పై కేసు వేస్తా .. డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుండి తొలగింపు వార్తలపై స్పందించిన జానీ మాస్టర్.. #JaniMaster #DanceDirectorsAssociation #Choreographer #RTV pic.twitter.com/V5ef6RDnFb — RTV (@RTVnewsnetwork) December 9, 2024 Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..! తాను డ్యాన్సర్స్ యూనియన్‌లోని మెంబర్ అని.. తనను ఎవరూ తొలగించలేరని తెలిపారు. రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్లపై లీగల్‌గా వెళ్తానని పేర్కొన్నారు. అయితే కొన్ని ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. లేనివి ఉన్నట్లు క్రియేట్ చేసి చూపించడం చాలా బాధగా ఉందని అన్నారు. పనిని, టాలెంట్‌ని ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు. Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! తన పదవీ కాలం ఇంకా ఉన్నా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించారన్నారు. ఎవరికి వారు హోదాలు, నిర్ణయాలు తీసుకునే హక్కు లేదన్నారు. ఎన్నికలకు కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తానని అన్నారు. టాలెంట్ ఉన్నవారికి పని ఇవ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరన్నారు. ప్రస్తుతం ఓ సినిమా కోసం రిహార్సల్ చేస్తున్నామని తెలిపారు.