బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌. కృష్ణయ్య

బీజేపీ మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్‌.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. ఒడిశా నుంచి సుజిత్ కుమార్, హర్యనా నుంచి రేఖాశర్మ పేర్లను ప్రకటించింది.గతంలో ఆర్‌.కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేశారు.

New Update
R Krishnayya

బీజేపీ మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్‌.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. అలాగే ఒడిశా నుంచి సుజిత్ కుమార్, హర్యనా నుంచి రేఖాశర్మ పేర్లను ప్రకటించింది. అయితే గతంలో ఆర్‌.కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీ ఆయనకు రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.  

Also Read: ఆ రోజు కాళ్లు మొక్కి ఇప్పుడు తిడతావా.. కేసీఆర్ పై వెంకట్ రెడ్డి ఫైర్

అయితే రాజ్యసభ ఉపఎన్నికల నామినేషన్ తుదిగడువు రేపటితో ముగియనుంది. కూటమి ప్రభుత్వం నుంచి రేపు (మంగళవారం) ముగ్గురు నేతలు నామినేషన్ వేయనున్నారు. బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆర్‌ కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు.  

Also Read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్‌ 19 మహమ్మారి..39 మంది మృతి

మరోవైపు కూటమి తరఫున మూడో అభ్యర్థి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సానా సతీష్ సహా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సానా సతీష్ విషయంలో కూటమి పార్టీల ఏకాభిప్రాయ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఆశావాహులు కలుస్తూనే ఉన్నారు. 

Also Read: మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

Also Read: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీని సపోర్ట్ చేస్తూ RGV సంచలన ట్వీట్

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు