Manchu Manoj: మంచు మనోజ్ కి పవన్ కళ్యాణ్ హై సెక్యూరిటీ

మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవ నేప‌థ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు వచ్చారు. ఈ క్ర‌మంలో మోహ‌న్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్స‌ర్లు చేరుకున్నారు. అయితే మనోజ్ ను సపోర్ట్ చేసేందుకు గబ్బర్ సింగ్ టీమ్ రంగంలోకి దిగింది.

New Update
pawan 001

మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొన‌సాగుతోంది. నిన్న ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో మోహ‌న్ బాబు చిన్న కుమారుడు మంచు మ‌నోజ్ వైద్య ప‌రీక్షలు చేయించుకున్నారు. మ‌నోజ్ ఒంటిమీద గాయ‌లైన‌ట్లు వైద్యులు నిర్థారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఆస్తుల పంపకాల విషయంలో మంచు ఫ్యామిలీలో గొడ‌వ జ‌రిగిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 

మంచు మ‌నోజ్ పై దాడి నేప‌థ్యంలో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు వచ్చారు. జ‌ల్‌ప‌ల్లిలోని మంచు మోహ‌న్ బాబు ఇంటికి కాసేప‌ట్లో చేరుకోనున్నారు. ఈ క్ర‌మంలో మోహ‌న్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్స‌ర్లు చేరుకున్నారు. విష్ణు త‌రుపున 40 మంది బౌన్స‌ర్లు, మ‌నోజ్ త‌రుపున 30 మంది బౌన్స‌ర్లు మోహ‌న్ బాబు నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ టీమ్ సెక్యూరిటీ..

అయితే మనోజ్ తరపు బౌన్స‌ర్స్ లో పవన్ కళ్యాణ్ కు ఒకప్పుడు సెక్యూరిటీ టీమ్ గా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో మనోజ్ కు పవన్ పరోక్షంగా పవన్ సపోర్ట్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ - మనోజ్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఇప్పుడు మనోజ్ పక్కన పవన్ బాడీ గార్డ్స్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 

Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్

Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్

Also Read : మంచు ఫ్యామిలీ కొట్లాటలో బిగ్ ట్విస్ట్.. మనోజ్ ఇంటికి విష్ణు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు