తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు సభలో 5 బిల్లులు, 2 నివేదికలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు తదితర అంశాలపై సీఎం రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటు తెలంగాణ జీతాలు, పింఛన్ల చెల్లింపు, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లులు, తెలంగాణ పురపాలక సంఘాల సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
శిక్షణ ఇచ్చిన తర్వాత..
అలాగే రైతు భరోసా విధి విధానాలపై కూడా చర్చించనున్నారు. వీటితో పాటు రెవెన్యూ చట్టం, మహిళా వర్సిటీ బిల్లు గురించి చర్చించనున్నారు. అయితే ఈ సారి ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలు ఉండటంతో వారికి రెండు నుంచి మూడు రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత మళ్లీ సమవేశాలను ప్రారంభించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఛార్జిషీట్లు ప్రకటించింది. దీంతో ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వస్తువుల సేవల పన్ను(సవరణ) ఆర్డినెన్స్-2024 బిల్లు, తెలంగాణ విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక 2022-23ను కూడా ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కొండా సురేఖ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక (2021-2022), మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్స్-2024ను సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ శీతాకాల సమావేశాలు నేడు జరిగి మంగళవారం, బుధవారం వాయిదా పడనున్నాయి. మళ్లీ గురువారం నుంచి మొదలు కానున్నాయని సమాచారం.
ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!
ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!