పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జీవో 46పై సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం దీనిపై విచారణ జరిగింది. జీవో 46పై తమ వైఖరి, పోస్టుల భర్తీ విషయంలో చూపించిన విధానంపై కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 27కు తదుపరి విచారణను వాయిదా వేసింది. Also Read: కేటీఆర్‌కు మాతో పోల్చుకునే అర్హత లేదు.. భట్టి సంచలన కామెంట్స్! Supreme Court అయితే కేసు తేలేవరకు భర్తీ కాకుండా ఖాళీగా ఉండిపోయిన 900 పోస్టుల భర్తీని ఆపాలని బాధితుల తరపు లాయర్ ఆదిత్య సొంది వాదనలు వినిపించారు. దీంతో వచ్చే విచారణ వరకు వేచి చూడాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కోర్టులో బాధితుల తరపున వాదించిన వారిలో సుప్రీంకోర్టు లాయర్ ఆదిత్య సొంది, మిథున్ శశాంక్, జీ విద్యాసాగర్ ఉన్నారు. బాధితుల వైపు విచారణకు బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, ఏనుగుల రాకేష్ రెడ్డి హాజరయ్యారు. Also Read: కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన.. పోలీసులతో వాగ్వాదం ఇదిలాఉండగా.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా జీవో 46ను తీసుకొచ్చింది. ఈ జీవో వల్ల చాలామంది అర్హులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని పోలీస్ ఉద్యోగార్థులు ఆందోళనలు చేపట్టారు. ఆ తర్వాత జీవో 46ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో బాధితులు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. Also Read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్ 19 మహమ్మారి..39 మంది మృతి Also Read: మహాకుంభమేళా కోసం 13 వేల రైళ్లు.. అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన