/rtv/media/media_files/2024/12/09/t0hPq5GxgqybUDCBzLoo.jpg)
హైదరాబాద్ కోఠిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.18 వేల ఫిక్స్‌డ్ జీతాలు డిమాండ్ చేస్తూ కోఠి డిఎంవి కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్నారు. పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించగా.. వారితో వాదనకు దిగారు ఆశా కార్యకర్తలు. ఏసీపీ శంకర్‌ను ఆశా వర్కర్లను చుట్టుముట్టారు. పరిస్థితుల అదుపుతప్పడంతో పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!
ఆందోళనకారులను అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుంటున్న తరుణంలో ఓ మహిళా పోలీస్ అధికారిపై చేయి చేసుకుంది. ఆశావర్కర్లను పోలీస్ వ్యాన్ ఎక్కిస్తుండగా.. అధికారి చెంపపై కొట్టింది మహిళ. అ సన్నివేశం వీడియోలో రికార్డ్.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Asha worker slapped a police official in Sulan Bazar in Hyderabad @XpressHyderabadpic.twitter.com/ItkQ9kbfO9
— V.V. Balakrishna-TNIE (@balaexpressTNIE) December 9, 2024