రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. ఈ విషయంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ మనోజ్, మోహన్ బాబు మధ్య రాజీ కుదుర్చాలని ప్రయత్నాలు చేయగా విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో మంచు లక్ష్మి తిరిగి ముంబై వెళ్లిపోయారట.

New Update

రంగంలోకి శ్రీశైలం యాదవ్ 

అయితే మనోజ్, మోహన్ బాబు మధ్య జరుగుతున్న ఈ ఆస్తి వివాదాన్ని సెటిల్ చేయడానికి మంచు ఫ్యామిలీ సన్నిహితుడు  శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగనున్నారట. శ్రీశైలం యాదవ్‌కు మంచు ఫ్యామిలీతో అనుబంధం ఉంది.  గతంలో మంచు మనోజ్ శ్రీశైలం యాదవ్  కూతురు పెళ్ళికి కూడా వెళ్లారు.  ఇది ఇలా ఉంటే ఈరోజు తెల్లవారుజామున మంచు విష్ణు బిజినెస్ పార్ట్నర్ విజయ్.. జల్ పల్లిలోని మనోజ్ ఇంటికి వెళ్లి అతని ఇంటి సీసీ టీవీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ తీసుకెళ్లాడు. గత రెండు రోజులుగా మనోజ్ ఇంటి ముందు విష్ణు బౌన్సర్లు కాపలా కాస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న విష్ణు తాజాగా హైదరాబాద్ వచ్చాడు. 

ఏం జరిగిందంటే?

పలు నివేదికల సమాచారం ప్రకారం.. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గత కొంత కాలంగా ఈ ఆస్తుల వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు మనోజ్ తన వాటాపై మోహన్ బాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా తాజాగా మరోసారి జరిగిన చర్చల్లో మంచు మనోజ్ అడిగిన దానికి మోహన్ బాబు నిరాకరించడంతో.. వీరి మధ్య గొడవ వాతావరణం ఏర్పడినట్లు తెలుస్తోంది. మధ్యలో తనకు మద్దతుగా వచ్చిన భార్య మౌనిక పై మోహన్ బాబు చేయి చేసుకున్నట్లు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మంచు కుటుంబం మరో సారి వార్తల్లో నిలిచింది. గాయాలతో వెళ్లి మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. మోహన్ బాబు కూడా మనోజ్ పై ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరి మంచు ఫ్యామిలీలో భగ్గుమన్న ఆస్తుల వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి. 

Also Read: Urfi Javed : ఉర్ఫీ మ్యాజికల్ గౌన్ పై నటి సమంత పోస్ట్.. వైరలవుతున్న వీడియో..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు