Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప2' ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా .. తొలిరోజు నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరోజు రూ.294 కోట్ల వసూళ్లను సాధించి ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా చరిత్ర సృష్టించింది.
నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల దిశగా..
తాజాగా మేకర్స్.. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 నాలుగు రోజుల కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజుల్లోనే రూ. 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే అత్యంత వేగంగా రూ. 829 కోట్ల మార్క్ ను చేరుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇదే జోష్ కొనసాగితే మరో రెండు రోజుల్లో 1000 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయం. ఇది ఇలా ఉంటే పుష్ప2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా.. రూ.294 కోట్ల వసూళ్లు చేయగా.. రెండవ రోజు రూ. 90 కోట్ల వసూళ్లను రాబట్టింది.
Also Read: Breaking: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..!
నార్త్ లో పుష్ప2 హవా..
ముఖ్యంగా నార్త్ లో పుష్ప2 హవా ఎక్కువగా కనిపిస్తోంది. హిందీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తొలిరోజు ఈ చిత్రం బాలీవుడ్ సినిమాల ఓపెనింగ్ రికార్డులను సైతం వెనక్కి నెట్టేసి రూ.72 కోట్లతో హిందీలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు చేసింది. ఈ చిత్రం హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజుల్లో రూ.205 కోట్లు రాబట్టింది.
Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!