AP News: ముంబై సినీ నటి జత్వాని కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌కు బెయిల్ మంజూరైంది. కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం విచారించిన ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
76 రోజులు జైలులో..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన జత్వాని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుక్కల విద్యాసాగర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో నిందితుడు తరుపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. జత్వానీ, పోలీసుల తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీ నారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తారని తెలిపారు. నిందితుడు ఇప్పటికే 76 రోజులుగా జైలులో ఉన్నాడని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేసుపై తీర్పును హైకోర్టు సోమవారం నాటికి వాయిదా వేసింది. ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం విద్యాసాగర్‌కు షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి: రాచరిక పాలనలో అసలైన తెలంగాణ చరిత్ర మరుగునపడింది.. పొన్నం ఫైర్
ఇక ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చాక విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. కొన్నిరోజులు ముంబైలో, మరికొన్ని రోజులు ఢిల్లీలో తలదాచుకున్నారని పోలీసులు గుర్తించారు. చివరకు డెహ్రాడూన్‌లోని ఓ రిసార్ట్ వద్ద విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి మూడో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు.
..