TG News: ఆడపిల్ల పుట్టిందని ఊరంతా చీరలు పంచిన తండ్రి

జగిత్యాల జిల్లా బీర్​పూర్ మండలం తుంగూరులో ఓగులపు అజయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. మహాలక్ష్మి పుట్టిందని ఊరిలోఉన్న ప్రతి మహిళకు చీరలను ఇంటింటికీ తిరుగుతూ తండ్రి పంపిణీ చేశారు. అజయ్‌ అలా పంచడానికీ రూ.30 కోట్ల లాటరీ తగటం కూడా ఓ కారణం ఉందట.

New Update
baby.

TG News

TG News: ఆడపిల్లలను భారంగా చూసే రోజులు ఇవి. ఇందుకు కారణం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థం అవుతుంది. అయితే కొందరి ఇంట్లో ఆడపిల్లలు పుడితే ఎంతగానో బాధపడతారు. కొంతమంది ఆడపిల్ల పుట్టగానే కడతేర్చే వాళ్లు కూడా ఉంటారు. అబ్బాయి కావాలని ఎంతోమంది భార్యలను వేధిస్తారు. కానీ అమ్మాయి పుట్టేసరికి అందరికీ అదొక భారంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లకు విలువ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ తండ్రి చేసిన పనిని చూస్తే మాత్రం ఇలాంటి అదృష్టం ప్రతి ఆడపిల్లకు కావాలని కోరుకుంటాం. ఈ కాలంలో కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారంటే వీళ్ళను చూసి ఎంతోమంది తల్లిదండ్రులు గర్వపడాలి. ఆ తండ్రి చేసిన పని ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

మహాలక్ష్మి పుట్టిందని పండుగలా సెలబ్రేట్:

ఆడ పిల్ల పుడితే భారంగా భావిస్తుంటారు కొంతమంది. అమ్మాయి పుట్టింది అనగానే బాధపడతారు. తమపై దించుకోలేని భారం పడిందని భావిస్తుంటారు. ఆడపిల్ల పుట్టింది అనగానే సంతోషం కంటే ఎక్కువగాగా అసహనం, తెలియని బాధ ఉంటుంది. ఆడపిల్ల పుడితే అరిష్టమని, మనకిది శాపమని భావించేవాళ్లూ ఉన్నారు. మగ పిల్లవాడు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబురాలు జరుపుకునే వారిని చూస్తుంటాం. అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ విలువ ఇస్తారు చాలా మంది. అమ్మాయి పుట్టిందని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఊరంతా చీరలు పంచాడు. 

ఒక్కసారిగా కోటీశ్వరుడు:

జగిత్యాల జిల్లా బీర్​పూర్ మండలం తుంగూరులో ఓగులపు అజయ్ భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. తండ్రి అజయ్‌ మహాలక్ష్మి పుట్టిందని ఊరిలోఉన్న ప్రతి మహిళకు చీరల పంపిణీ చేశాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఘనంగా సంబురాలు చేసుకున్నాడు. అంతేకాదు 1500 చీరలను ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఇంటికి మహాలక్ష్మి వంచిందని సంతోషంగా చీరలను పంపిణీ చేసినట్లు అజయ్ తెలిపారు. అజయ్‌ అలా పంచడానికీ ఓ కారణం ఉందట. అజయ్ బతుకుదెరువు కోసం దుబాయ్​లో పని చేసేవాడు. అక్కడ ఉన్న సమయంలో రెండేళ్ల క్రితం రూ.30 కోట్ల లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఇంటింటికీ ఉచితంగా చీరలు పంపిణీ చేశానని అజయ్  చెప్పుకోచ్చారు.

Also Read: ఈ ఆకుతో టీ చేసుకుని తాగితే డయాబెటిస్-కొలెస్ట్రాల్‌ కంట్రోల్‌

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు