రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం అయ్యారు. ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం డిసెంబర్ 10 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రాకు కేంద్రం ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు అప్పగించింది. సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన 26న ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 11-12-204 నుంచి 11-12-2027 వరకు ఈయన పదవి కాలం కొనసాగుతుంది.
𝐒𝐚𝐧𝐣𝐚𝐲 𝐌𝐚𝐥𝐡𝐨𝐭𝐫𝐚 𝐚𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐞𝐝 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐨𝐫 𝐨𝐟 𝐑𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐁𝐚𝐧𝐤 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚 pic.twitter.com/n8BacoLkv9
— Soumyajit Pattnaik (@soumyajitt) December 9, 2024
Also Read: ఆ రోజు కాళ్లు మొక్కి ఇప్పుడు తిడతావా.. కేసీఆర్ పై వెంకట్ రెడ్డి ఫైర్
వాస్తవానికి శక్తికాంత దాస్ 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021లోనే ఆయన పదవీకాలం ముగిసింది. కానీ కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. అంటే శక్తికాంత దాస్ మొత్తం ఆరేళ్లపాటుగా ఆర్బీఐ గవర్నర్‌గా సేవలందించారు. డిసెంబర్ 10తో ఆయన పదవీ కాలం ముగియడంతో రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రాకు కేంద్రం ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
Also Read: కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన.. పోలీసులతో వాగ్వాదం
సంజయ్ మల్హోత్రా కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చాక సివిల్స్ వైపు ఆసక్తి చూపారు. చివరికీ1990లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: మళ్లీ నేనున్నానంటున్న కొవిడ్ 19 మహమ్మారి..39 మంది మృతి