అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా

తెలుగు రాష్ట్రాల శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం సౌత్‌ సెంట్రల్ రైల్వే మరో 34 సర్వీసులను నడపనుంది. అయ్యప్ప భక్తులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

Ap-Tg: తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వేమరో శుభవార్త చెప్పింది. అయ్యప్ప భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. శబరిమలకు ఇప్పటికే పలు రైళ్లు నడుపుతోన్న దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా జనవరిలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని అనుకుంటుంది.

జనవరి 3 నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ ప్రత్యేక రైళ్లు సర్వీసులు నడవనున్నట్లు సమాచారం అందుతుంది. కొట్టాయం - సికింద్రాబాద్‌, మౌలాలి - కొట్టాయం, కాచిగూడ - కొట్టాయం, హైదరాబాద్‌ - కొట్టాయం, మౌలాలి - కొల్లం మధ్య రైళ్లు నడవనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ టౌన్ నుంచి కొల్లం జనవరి 6, 13 తేదీల్లో స్పెషల్‌ ట్రైన్లు నడుస్తాయి.

Also Read: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!

నర్సాపూర్ నుంచి కొల్లం జనవరి 20, 27 తేదీల్లో, మౌలాలి-కొట్టాయం - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైలు తెలంగాణలోని.. నల్గొండ, మిర్యాలగూడ,చర్లపల్లిలో ఆగుతాయి. ఏపీలోని సత్తెనపల్లి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు,నడికుడి,  రేణిగుంటగుంటూరు, తెనాలి, చీరాల, పిడుగురాళ్ల, లో ఆగనున్నాయి.

Also Read: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

34 అదనపు సర్వీసులు...

అలాగే కాట్పాడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్‌, తిరుప్పుర్‌, కోయంబత్తూర్‌, పాలక్కడ్‌, త్రిశ్శూర్‌, అలువ, ఎర్నాకుళం, ఎట్టుమానూర్‌ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు శుక్ర, శనివారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. మౌలాలి-కొల్లం- మౌలాలి ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, భువనగిరి, డోర్నకల్‌,కేసముద్రం,  ఖమ్మంలో స్టాప్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలోని విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో ఆగుతాయి.

Also Read: యుద్ధంలో 43 వేల మంది సైనికులను కోల్పోయాం, శాంతి కావాలి: జెలెన్స్కీ

కాట్పాడి, పొడన్నూరు, పాలక్కాడ్‌, త్రిశ్శూరు, అలవు, ఎర్నాకుళం, ఎట్టుమానూర్‌, కొట్టాయం,జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్‌, తిరుప్పుర్‌,  చెంగనస్సేరి, తిరువల్ల, చెంగన్నూర్‌, కాయంకుళం స్టేషన్లలో హాల్ట్‌ ఉన్నాయి. ఈ రైళ్లు శని, సోమవారాల్లో రాకపోకలు కొనసాగిస్తాయి. 

Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. చదవని మెస్సేజ్‌లను గుర్తుచేస్తోందట!

కాచిగూడ -కొట్టాయం- కాచిగూడ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు తెలంగాణలోని మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడలో ఆగుతాయి. ఏపీలోని చీరాల, ఒంగోలు, నడికుడి, నెల్లూరు,పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, గూడూరు, రేణిగుంటలో ఆగనున్నాయి. అలాగే కాట్పాడి,కోయంబత్తూరు, పాలక్కడ్‌, త్రిశ్శూరు, అలవు, ఎర్నాకుళం, ఎట్టుమానూర్‌ జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్‌, తిరుప్పుర్‌,  స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లు ఆది, సోమ వారాల్లో సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ - కొట్టాయం - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని బేగంపేట, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్‌, తాండూరులో ఆగుతాయి. సేలం, సులేహల్లి, యాద్గిర్‌, కృష్ణ, రాయ్‌చూరులో ఆగుతాయి. ఏపీలోని మంత్రాలయం, ఆదోని, గుంతకల్‌, గుత్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వే స్టేషన్‌లలో ఆగుతాయి. జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్‌, తిరుప్పుర్‌, కోయంబత్తూర్‌, పాలక్కడ్‌, త్రిశ్శూర్‌, అలువ,కాట్పాడి, ఎర్నాకుళం టౌన్‌ స్టేషన్లలో ఆగుతాయి. 

ఈ రైళ్లు మంగళ, బుధవారాల్లో మొత్తంగా ఎనిమిది సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.ఈ రైళ్లలో ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు సైతం ఉంటాయని అధికారులు వివరించారు. అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు