కొత్త తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రభత్వం అమోదం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈరోజు ప్రభుత్వం పాస్ చేసింది.అది కూడా తెలుగులోనే. దాంతో పాటూ డిసెంబర్ 9న ప్రతీ ఏడూ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి.. ఈ రూపాన్న అవహేళనచేయడం, విమర్శించడం, వేరే విధంగా చూపడం లాంటి వాటిని నిషేధించింది ప్రభుత్వం. సోషల్ మీడియాఓ లేదా బయట ఎవరైనా తెలంగాణ తల్లి చిత్రాన్ని అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపింది. డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!
Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!
తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక..
తెలంగాణ తల్లి విగ్రహం భావితరాలకు స్ఫూర్తి కలిగించేదిగా ఉండాలని ప్రభుత్వం జీవో ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా గుర్తింపు తల్లితోనే..మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు... అవమానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి... తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మా సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు. ప్రజా ప్రభుత్వంలో ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. అలాగే..ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణా తల్లికి వివిధ రూపాలు ఇచ్చారు.కానీ ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ తల్లిని చూస్తే కన్నతల్లి ప్రతిరూపంగా స్పురిస్తోంది అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: Tomato: భారీగా పతనమైన టమోటా ధర... కిలో ఒక్క రూపాయికే
Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!