'పుష్ప 2' స్క్రీనింగ్‌ లో వింత ఘటన.. డైరెక్ట్ సెకండాఫ్ వేయడంతో ఆడియన్స్ షాక్

'పుష్ప 2' స్క్రీనింగ్‌లో ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. కొచ్చిన్‌లోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్‌లో ‘పుష్ప 2’ స్క్రీనింగ్‌లో తొలి భాగం ప్రదర్శించకుండా సెకండాఫ్‌ వేశారు. ఆ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించలేకపోయారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
pushpa2 001

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప2' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఎక్కడ చూసిన ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్‌లో ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : మంచు ఫ్యామిలీ కొట్లాటలో బిగ్ ట్విస్ట్.. మనోజ్ ఇంటికి విష్ణు

 కొచ్చిన్‌లోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్‌లో ‘పుష్ప 2’ స్క్రీనింగ్‌లో తొలి భాగం ప్రదర్శించకుండా సెకండాఫ్‌ వేశారు. ఆ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించలేకపోయారు. పలు సన్నివేశాలను ఎంజాయ్‌ చేశారు. ఇంటర్వెల్‌ సమయంలో శుభం కార్డు పడటంతో తాము ఇప్పటివరకూ చూసింది సెకండాఫ్‌ అని తెలుసుకున్నారు. 

ఆలస్యంగా వెలుగులోకి..

వెంటనే ఆ విషయాన్ని థియేటర్‌ యాజమాన్యానికి చెప్పారు. తమ డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని ప్రేక్షకులు డిమాండ్‌ చేశారు. కొంతమంది మాత్రం ఫస్టాఫ్‌ ప్రదర్శించమని కోరారు. దీంతో యాజమాన్యం పది మంది కోసం ఫస్టాఫ్‌ ప్రదర్శించింది. మిగిలినవారందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది.

Also Read : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్

Also Read: అసెంబ్లీ దగ్గర గందరగోళం.. BRS MLAలు అరెస్ట్, ట్రాక్టర్‌పై BJP MLAలు

Advertisment
Advertisment
తాజా కథనాలు