భిక్షగాళ్లలో ఇతను అంబానీ లాంటి వాడు.. అంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో భిక్షాటన చేసే వారిలో ఇతనే ధనికుడు. యాభైనాలుగేళ్ల భరత్ జైన్ అనే భిక్షగాడికి 7 కోట్ల 50 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయినా ఇప్పటికీ అతను భిక్షాటన చేస్తూనే జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన నెల సంపాదన రూ.60,000 నుంచి రూ.75,000 ఉంటుంది. భరత్ జైన్ ముంబైలో రూ.1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్స్, థాణేలో రెండు దుకాణాలు ఉన్నాయి. వీటి నుంచి ఆయనకు నెలకు రూ.30,000 వరకు ఆదాయం వస్తుంది. ALSO READ : నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు.. చైతూ టార్గెట్ గా సమంత పోస్ట్ పెట్టుబడులు పెట్టడంలో కూడా ఆయన తన ప్రతిభను చూపుతున్నారు. ఇద్దరు కుమారులు స్థిరపడినప్పటికీ, భరత్ మాత్రం భిక్షాటనను మానలేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా భరత్ జైన్ వార్తల్లో నిలిచాడు. కడు పేదరికం నుంచి భరత్ జైన్ బెగ్గింగ్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రపంచంలోనే భిక్షగాళ్లలో అతనికే ఎక్కువ ఆస్తి ఉంది. Also Read : తగ్గనున్న 'పుష్ప2' టికెట్ రేట్లు.. ఎప్పటి నుంచంటే? తన పిల్లలు తన మాదిరిగా కష్టాలు పడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తిని, తినక రూపాయ రూపాయి కూడబెట్టి కోట్లు సంపాధించాడు. సంపాధించిన డబ్బు ఖర్చు చేయకుండా వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం భరత్ జైన్‌కు అలవాటు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఆజాద్ మైదాన్‌తో సహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో భరత్ జైన్ భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఇల్లు, పెళ్లాం, పిల్లలు అందరూ ఉన్నా.. ఆస్తులు ఉన్నా అతను అడుక్కుంటూనే ఉంటాడు. Also Read: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు! Also Read: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా