ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC తాజాగా రిలీజ్ చేసింది. ఈ పరీక్షల హాల్‌టికెట్లను TGPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 15 ఉదయం 9 గంటల వరకు హాల్ టికెట్‌ను వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!
1368 కేంద్రాల్లో రాత పరీక్షలు
ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే మొత్తం 783 గ్రూప్- 2 పోస్టులను టీజీపీఎస్సీ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇది వరకే కమిషన్ తెలిపింది.
Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!
మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనుండగా.. అందులో 15వ తేదీన మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరగనుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ పేపర్ జరగనుంది. ఇక 16వ తేదీన కూడా ఇవే టైమింగ్స్‌లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు!
ఇదిలా ఉంటే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలి. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి అరగంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
Also Read: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!
. . . . . . .