తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత ఇదే.. అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో సోమవారం ఉదయం 10. 30 కి అసెంబ్లీ సమావేశాలు మొదలైయ్యాయి. తెలంగాణ తల్లి ఏర్పాటుపై సీఎం అంసెబ్లీలో ప్రకటన చేశారు.

New Update
CM O

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంతో సోమవారం ఉదయం 10. 30 కి అసెంబ్లీ సమావేశాలు మొదలైయ్యాయి. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పర్వదినమని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో అసెంబ్లీలో ప్రకటించారు. 

Also Read: అసెంబ్లీ దగ్గర గందరగోళం.. BRS MLAలు అరెస్ట్, ట్రాక్టర్‌పై BJP MLAలు

 తెలంగాణ ఉద్యమం ఓ భావోద్వేగ సందర్భమని ఆయన వ్యాఖ్యానించారు. మన సంస్కృ‌తి సంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి విగ్రమని.. విగ్రహం కింద పీఠంలో నీలి రంగు గోదావరి, కృష్ణమ్మలకు గుర్తు అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ విగ్రహం నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని తెలిపారు.

కుడి చేతితో జాతికి అభయాన్ని ఇస్తూ.. ఎడమ చేతితో మొక్కజొన్న, వరి పంటలు ప్రతిభింబిస్తూ తెలంగాణ తల్లి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటి వరకు అధికారికంగా గుర్తింపు లేదని ఆయన అన్నారు. ఆ విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం సెక్రటేరియట్ వద్ద ఆవిష్కరించబోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. గవర్నర్, ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు.

Also Read: తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత ఇదే.. అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు