Weather Update: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వానలే వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇలానే వర్షం కురుస్తుందని వెల్లడించింది.