Kannappa: కన్నప్ప టీంపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు!
కన్నప్ప మూవీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. సెన్సార్ స్క్రూటినీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. ఈ సినిమా సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే విధంగా నిర్మించబడిందని రిట్ పిటిషన్ దాఖలు చేశారు.