Dasara 2025: జైల్లో దసరా సంబరాలు.. ఇదే అదనుగా ఇద్దరు ఖైదీలు జంప్.. వీడియో వైరల్!
ఒడిశాలోని కటక్ జిల్లాలో దసరా వేడుకల సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హై సెక్యూరిటీ ఉండే చౌద్వార్ జైల్లో దసరా వేడుకలు జరుగుతుండగా ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. సెల్ ఊచలు రంపంతో కోసి వారు తప్పించుకున్నారు.