G2 Release Date: అడివి శేష్ ‘G2’ రిలీజ్ డేట్ ఖరారు.. పవర్ఫుల్ పోస్టర్ చూశారా?
అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'G2' విడుదల తేదీ ఖరారైంది. ఈ స్పై థ్రిల్లర్ 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. వినయ్ కుమార్ సిరిగానేడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్గా నటిస్తున్నారు.