🛑LIVE NEWS: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన!
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాతను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 67ఏళ్ల సుజాత వైద్యచికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా పక్కా సమాచారంతో జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
గాంధీభవన్లో రేపు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పీఏసీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.
జగిత్యాల పర్యటనలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు పింఛన్ను రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేది పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.
కామారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణలో 24 గంటలు లేదన్న రేవంత్... కరెంట్ తీగలు పట్టుకొని చూడాలని కేటీఆర్ చురకలు అంటించారు. విద్యుత్ కష్టాలు తీర్చాం కాబట్టే వరి పంటలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రైలు కిందపడి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాద ఘటనలో డ్రైవర్పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. సర్వీస్ నుంచి తొలగించారనే మనస్తాపంతో డ్రైవర్ నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడు.
సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోవాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ములుగు ప్రజలు తనవైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. గంగుల కమలాకర్ హయాంలో కరీంనగర్ అవినీతిలో టాప్ ప్లేసులో నిలిచిందని అన్నారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి గంగుల అంటూ ఫైర్ అయ్యారు.