🔴Live News Updates: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

RTV LIVE Telugu News App

RTV న్యూస్ యాప్(RTV NEWS APP) ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు. 

RTV News App Download Links:

ఆండ్రాయిడ్ వినియోగదారులు(Android) - LINK
IOS వినియోగదారులు - LINK

  • Jun 06, 2025 21:48 IST

    ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన ప్రైవేట్ హాస్పిటల్

    ప్రసవం చేయాలని ప్రభుత్వం హాస్పిటల్‌కు వెళ్తే.. బిడ్డ చనిపోయిందని కాన్పు చేసేందుకు నిరాకరించారు డాక్టర్లు. ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్లు మహిళకు డెలివరీ చేయగా.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

    Negligence of doctors



  • Jun 06, 2025 21:13 IST

    ప్రీతి జింటా ఎమోషనల్.. ఐపీఎల్ ఫైనల్‌లో ఓటమిపై తొలి రియాక్షన్

    ఈ IPL సీజన్‌ అద్భుతంగా జరిగిందంటూ పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతిజింటా ఎమోనల్ పోస్టు పెట్టారు. ‘‘తాజా IPL సీజన్‌ మేం అనుకున్నట్లుగా ముగియలేదు. మా యువ జట్టు పోరాటం, ధైర్యం ఎంతో నచ్చింది. మా కెప్టెన్ జట్టును నడిపించిన తీరు గొప్పగా ఉంది’’ అని రాసుకొచ్చారు.

    preity zinta emotional first post on pbks final runner up
    preity zinta emotional first post on pbks final runner up Photograph: (preity zinta emotional first post on pbks final runner up )

     



  • Jun 06, 2025 19:09 IST

    అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో రూ.3.85 కోట్లు స్వాహా

    అయోధ్య రామమందిరం ప్రసాదం హోమ్ డెలివరీ చేస్తామని ఓ వ్యక్తి భక్తుల నుంచి ఆన్‌లైన్‌లో వసూళ్లు చేశాడు. 6.3 లక్షలకు పైగా భక్తుల నుంచి రూ.3.85 కోట్లు తీసుకున్నారు. రామ మందిరం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ స్కామ్ జరగగా.. సైబర్ పోలీసులు ఇటీవల బయటపెట్టారు.

    ayodhya ram mandir prasad



  • Jun 06, 2025 18:41 IST

    ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ మహేష్ సంచలన ప్రకటన!

    ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పూర్తి స్థాయి కార్యకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వాటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    TPCC Chief Mahesh Kumar Goud
    TPCC Chief Mahesh Kumar Goud

     



  • Jun 06, 2025 18:07 IST

    లక్కీ కపుల్.. రూ.257 పెడితే - రూ.12 కోట్లు లాభం!

    భార్యతో కలిసి రెస్టారెంట్‌ భోజనానికి వెళ్లిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఒక లాటరీ క్షణాల్లో అతడిని కోటీశ్వరుడిని చేసింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ కపుల్ రూ.257తో లాటరీ కొనుగోలు చేసింది. దాన్ని స్క్రాచ్ చేయగా రూ.12.86 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

    Dinner Date Turns Into Rs 12.8 Crore Lottery Win For US Couple



  • Jun 06, 2025 16:09 IST

    ఆ కామాంధుడు ట్రంప్‌‌పై 34 కేసులు.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఇదే!!

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ఎలన్ మస్క్ సెక్స్ కుంభకోణం ఆరోపణలు చేశారు. గతంలో పోర్న్ స్టార్ డానియల్‌ కేసులో 34 నేరాల్లో కూడా ట్రంప్‌ని దోషిగా తేల్చింది కోర్టు. అంతేకాదు ట్రంప్‌పై అనేక లైంగిక ఆరోపణలున్నాయి.

    trump with stormy daniels



  • Jun 06, 2025 15:32 IST

    కేసీఆర్, హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు

    ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పటి కంటే.. గత పదేళ్లలోనే ఏపీ ఎక్కువగా నీళ్లు ఎత్తుకుపోయిందని మంత్రి ఉత్తమ్ రెడ్డి ఆరోపించారు. నాటి సీఎం KCR, మంత్రి హరీష్ ఏపీ కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నీటిని తరలించుకుపోయేందుకు జగన్-కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు.

    KCR Harish Rao Uttam Kumar reddy
    KCR Harish Rao Uttam Kumar reddy

     



  • Jun 06, 2025 14:00 IST

    HHVM: ఇట్స్ అఫీషియల్.. హరిహరవీరమల్లు మళ్ళీ వాయిదా!

    ఈనెల 12న విడుదల కావాల్సిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ట్రైలర్ తో పాటు కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ ఎదురైంది.

    Pawan Kalyan Harihara Veeramallu
    Pawan Kalyan Harihara Veeramallu

     



  • Jun 06, 2025 13:41 IST

    Covid-19: అలెర్ట్.. అలెర్ట్‌.. 5 వేలు దాటిన కరోనా కేసులు, 58 మరణాలు

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌కు గురైన వారి సంఖ్య తాజాగా 5 వేలు దాటడం కలకలం రేపుతోంది. అలాగే ఇప్పటిదాకా కరోనా వల్ల దేశంలో 55 మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

    India reports 4 Covid-19 deaths in 24 hours, active cases rise to 5,364
    India reports 4 Covid-19 deaths in 24 hours, active cases rise to 5,364

     



  • Jun 06, 2025 13:40 IST

    Vijay Malya: 'నేను దొంగను కాదు'.. సంచలన విషయాలు వెల్లడించిన విజయ్ మాల్యా

    విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉండటంతోనే భారత్‌ విడిచి వెళ్లిపోయానని చెప్పారు. తాను దొంగను కాదని.. అసలు ఇక్కడ దొంగతనం ఎక్కడ జరిగిందంటూ మాట్లాడారు.

    Vijay malya
    Vijay malya



  • Jun 06, 2025 13:40 IST

    Bengaluru Stampede - Arrest Kohli: కోహ్లీని అరెస్టు చేయాలి.. ఎక్స్‌లో ట్రెండింగ్

    ఆర్సీబీ విజయోత్సవ సభ వేళ చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్‌లో అరెస్ట్‌ కోహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. కొహ్లీని అరెస్టు చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

    Virat Kohli
    Virat Kohli

     



  • Jun 06, 2025 11:24 IST

    USA: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహం

     డోజ్ నుంచి తప్పుకున్నాక ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మధ్య చెడింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో మొదలైన గొడవ..ఇప్పుడు హద్దులు దాటిపోయింది. దీంతో మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. 

    usa
    Elon Musk-Donald Trump

     



  • Jun 06, 2025 11:24 IST

    Japan Moon Mission Failure: చంద్రునిపై జపాన్ చేపట్టిన ప్రయోగం విఫలం

    ఇటీవల జపాన్ చంద్రనిపై అడుగు పెట్టేందుకు కీలక ప్రయోగం చేపట్టింది. ఆ దేశానికి చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ 'ఐస్పేస్' చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు మూన్ మిషన్‌ను ప్రయోగించింది. కానీ ల్యాండర్‌తో కమ్యునికేషన్ తెగిపోవడంతో ఈ ప్రయోగం విఫలమయ్యింది.

    Resilience spacecraft likely crashed into the moon, Ispace confirms
    Resilience spacecraft likely crashed into the moon, Ispace confirms

     



  • Jun 06, 2025 11:23 IST

    RBI Repo Rate Cut: గుడ్ న్యూస్..వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మళ్ళీ సవరించింది. రెపో రేట్ ను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.  దీంతో వడ్డీ రేట్లు 6శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చాయి. 

    RBI



  • Jun 06, 2025 10:02 IST

    Breaking: బెంగళూరు తొక్కిసలాటలో మొదటి అరెస్ట్

    బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఎఐఆర్ నమోదయింది. తాజాగా ఈ కేసులో ఈర్సీబీ మార్కెటింగ్ హెడ్ సొసలే అరెస్టయ్యారు. 

    rcb
    Nikhil Sosale

     



  • Jun 06, 2025 08:26 IST

    UN: దొంగచేతికే తాళాలు..ఉగ్రవాదాన్ని కట్టడి చేయమని పాక్ కే చెప్పిన ఐరాస

    దొంగ చేతికే తాళాలు ఇచ్చాడంట ఓ యజమాని..ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చేసిన పని అలాగే ఉంది. ఉగ్రవాదాన్ని కట్టడి చేయమని దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఐరాస చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

    emergency meeting of the United Nations Security Council (UNSC) is being held today on the demand of Pakistan
    United Nations Security Council (UNSC) 

     



  • Jun 06, 2025 08:25 IST

    Trump-musk: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు..ట్రంప్,మస్క్ మాటల యుద్ధం

    వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలోన్ మస్క్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మస్క్ నన్ను నిరాశకు గురి చేశారు అని ట్రంప్ అంటే ఆయనొక కృతజ్ఞత లేని వ్యక్తి అని ఎలాన్ విమర్శించుకున్నారు. 

    usa
    Elon Musk-Donald Trump

     



  • Jun 06, 2025 08:24 IST

    Russia-Ukraine: ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులు మొదలెట్టిన రష్యా..ఉద్రిక్త పరిస్థితులు

    ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులను మొదలుపెట్టింది రష్యా.  ఉక్రెయిన్ ఒక్కసారి డ్రోన్లతో విరుచుకుపడి...రష్యా తాలూకా 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా ఇప్పుడు భారీ క్షిపణులతో రష్యా దాడులకు తెగబడుతోంది. 

    Russia Attack on Ukraine
    Russia Attack on Ukraine

     



  • Jun 06, 2025 07:22 IST

    BJP Minister: మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

    మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. విదేశీ ఆచారమైన ఈ విధానం భారత సంప్రదాయానికి విరుద్ధమన్నారు.

    I don’t like women in revealing dresses, bjp minister Vijayvargiya makes controversial remark
    I don’t like women in revealing dresses, bjp minister Vijayvargiya makes controversial remark

     



  • Jun 06, 2025 07:03 IST

    TS: ఉద్యోగులకు డబుల్ డీఏ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం

    నిన్న సుదీర్ఘంగా ఐదు గంటలపాటూ తెలంగాణ కేబినెట్ మీటింగ్ సాగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని డిసైడ్ అయింది. 

    Telangana Cabinet
    Telangana Cabinet

     



  • Jun 06, 2025 07:02 IST

    Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే?

    స్థానిక ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ ఆఖరిలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై కొంతసేపు సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు సమాచారం.

    Telangana Local Body Elections
    Telangana Local Body Elections

     



Advertisment
Advertisment
తాజా కథనాలు