/rtv/media/media_files/2025/06/06/FaMPt14CNLEPB4SkaDtA.jpg)
సుంకాలు, నిబంధనలు అంటూ అందరికీ షాక్ ఇస్తున్న ట్రంప్‌కు ఎలన్ మస్క్ సెక్స్ కుంభకోణం పేరు చెప్పి షాక్ ఇచ్చాడు. అమెరికా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌కు లింకులు ఉన్నాయని ఎలన్ మస్క్ ఆరోపించారు. దీంతో ట్రంప్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. నిన్న మొన్నటి దాకా ట్రంప్ వెంట ఉండి.. ఎలక్షన్‌లో ఆయన కోసం పని చేశాడు. ఎలన్ మస్క్ ఎన్నికల ప్రచారం కోసం 288 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు. రిపబ్లికన్ పార్టీకీ అత్యధిక పొలిటికల్ ఫండ్స్ ఇచ్చిన వారిలో ఎలన్ మస్క్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. ట్రంప్ ప్రతిపాదించిన రిపబ్లికన్ ప్యాక్స్ బిల్లును ఎలన్ మస్క్ వ్యతిరేకించాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.
ట్రంప్‌పై ఎలన్ మస్క్ ఆరోణలేంటి?
పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ మస్క్ Xలో పోస్టు పెట్టారు. అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బయటపెట్టలేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ట్రంప్ గురించి షాకింగ్ విషయాలు బయటకొస్తాయని మస్క్ అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ను అధికారం నుంచి దింపాలనే ఓ నెటిజన్ పోస్ట్‌ను మస్క్ సమర్ధించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పోస్టులో ఉంది. దీన్ని మస్క్ రీ పోస్టు చేసి.. అవును అని రాసుకొచ్చారు. అమెరికాలోని సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్‌స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడికి క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్ బ్లూమ్‌బెర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టు డాక్యుమెంట్స్‌లో ఉందని ఓ వార్తాపత్రిక రాసింది. ఈక్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయటపెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు. అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతేడాది అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పేర్కొన్నారు. ఆ సమయంలోనే ఎప్‌స్టైన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడికి చెందిన ప్రైవేటు విమానంలో తాను తిరగలేదని ట్రంప్ స్పష్టం చేశారు.
జెఫ్రీ ఎప్‌స్టైన్ సెక్స్ కుంభకోణం
ఎప్‌స్టైన్ న్యూయార్క్‌లో పుట్టాడు. ఓ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, గణితం చదివాడు. కానీ, డిగ్రీ మాత్రం పూర్తి చేయలేదు. 1970ల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరాడు. అక్కడి విద్యార్థుల్లో ఒకరి తండ్రి ఎప్‌స్టైన్‌ను చూసి ప్రభావితమై.. వాల్‌స్ట్రీట్‌లోని తన భాగస్వామి అయిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌కు పరిచయం చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకే ఎప్‌స్టైన్ అండ్ కో అనే అసెట్‌మేనేజ్‌మెంట్ సంస్థను సొంతగా ప్రారంభించారు. ఆ కంపెనీ త్వరగా విజయం సాధించింది. హఠాత్తుగా వచ్చిపడిన సంపదతో ఎప్‌స్టైన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఇంటిని కొనుగోలు చేశాడు. అప్పట్లోనే న్యూయార్క్‌లో అతిపెద్ద ప్రైవేట్ హోమ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక్కడ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు. ఎప్‌స్టైన్ మిత్రుల్లో క్లింటన్, ట్రంప్, కెనడీ కుటుంబీకులు, మీడియా దిగ్గజం మద్రోక్, మిషెల్ బ్లూమ్‌బెర్గ్, రిచర్డ్ బ్రాన్సన్, మైకెల్ జాక్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వంటి వారు ఉన్నారు. ప్రైవేటు బోయింగ్ 747 విమానం కూడా ఉంది. దానిలో హైప్రొఫైల్ ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాలకు వెళ్లేవాడు. ఈ విమానాన్ని వర్జిన్ ద్వీపాల్లో స్థానికులు లోలితా ఎక్స్‌ప్రెస్ అని పిలిచేవారు. తరచూ దీనిలో యువతులు, బాలికలు అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో ఆ పేరు పెట్టారు.
ఎప్‌స్టైన్‌తో ట్రంప్ ఫ్రెండ్‌షిప్
జెఫ్రీ మీడియాకు దూరంగా ప్రైవేటు జీవితం గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. 2002 సెప్టెంబర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, నటులు కెవిన్ స్పాసీ, క్రిస్ టక్కర్‌తో కలిసి ఎప్‌స్టైన్ ప్రైవేటు జెట్‌లో ఆఫ్రికా ఖండంలో పర్యటించేందుకు వెళ్లారు. ఈ ఘటన మీడియాను ఆకర్షించింది. ఎవరీ ఎప్‌స్టైన్ అని తెలియజేస్తూ న్యూయార్క్ మ్యాగజైన్ ‘నిగూఢమైన కుబేరుడు: జెఫ్ ఎప్‌స్టైన్ అని ఓ ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్ కోసం అప్పట్లో(2002) ఫేమస్ బిజినెస్ మ్యాన్‌గా పేరున్న డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం కూడా తీసుకొంది. నాకు 15 ఏళ్ల నుంచి ఎప్‌స్టైన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడని ట్రంప్ మీడియాకు చెప్పుకొచ్చాడు. ఆ ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత 2003లో న్యూయార్క్ న్యూస్ పేపర్‌ను సొంత చేసుకోవాలని ట్రై చేసి జెఫ్రీ ఫేయిల్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి జెఫ్రీ తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.
బయటపడ్డ పామ్ బీచ్ బంగ్లా రహస్యాలు
కొంతకాలానికి ఎప్‌స్టైన్, ట్రంప్ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలున్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు బిల్‌క్లింటన్.. ఎప్‌స్టైన్‌తో కలిసి 27సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు 2016లో బయటపడ్డాయి. మాజీ మిస్ స్విడన్ ఎవా అండర్సన్, గిలిన్ మాక్స్‌వెల్‌లతో ఎప్‌స్టైన్ డేటింగ్ చేశాడు. కానీ, జీవితంలో ఎవరినీ పెళ్లిచేసుకోలేదు. పేద మధ్య తరగతి బాలికలు, యువతులకు డబ్బు ఆశగా చూపించి పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకా ఎక్కువ డబ్బు కమిషన్ ఇస్తానని ఆశచూపేవాడు. ఈ ఉచ్చులో చిక్కుకొన్న బాలికలకు ఎలా బయటపడాలో తెలియక ఎప్‌స్టైన్ చెప్పినట్లు వినేవారు. 2005లో ఓ 14ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఎప్‌స్టైన్ అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పామ్ బీచ్‌లోని భవనంపై పోలీసులు దాడి చేశారు.
50 మంది బాలికలపై..
ఎప్‌స్టైన్ రాసలీలలు, అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. కొన్నినేరాలు నిరూపితం కావడంతో దాదాపు 13 నెలల జైలు జీవితం గడిపాడు. 2019లో మీటూ ఉద్యమం మొదలు కావడంతో మరోసారి ఎప్‌స్టైన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని అదే ఏడాది జులైలో అరెస్టు చేశారు. ఈ సారి అతడి ఇంట్లో ‘ఛైల్డ్ పోర్నోగ్రఫీ’, నకిలీ పాస్‌పోర్టు దొరికాయి. దేశం దాటేందుకు యత్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 10న జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడి బాధితుల సంఖ్య 50 మంది వరకూ ఉంటుందని పామ్ బీచ్ పోలీస్ చీఫ్ మిచెల్ రెయిటర్.. ది మియామీ హెరాల్డ్ అనే పత్రికకు ఇటీవల వెల్లడించారు. జెఫ్రీకి నేరాల్లో సహకరించిన స్నేహితురాలు గిలెన్ మ్యాక్స్‌వెల్‌పై తాజాగా ఐదు నేరాలు నిరూపితమయ్యాయి. ఈ కేసుల్లో ఆమెకు 40 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
డబ్బులిచ్చి పోర్న్ స్టార్ నోరు ముయించిన ట్రంప్.. 34 నేరాల్లో దోషిగా
అప్పటివరకూ వ్యాపారవేత్త అయిన ట్రంప్ 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగాడు. గతంలో 2006, 2007లో ట్రంప్ పోర్న్ స్టార్ డానియల్‌తో ఏకాంతంగా గడిపాడు. అప్పట్లో స్టార్మీ డానియల్ వయసు 27 ఏళ్లు కాగా ట్రంప్ వయసు 60 సంవత్సరాలు. అప్పటికే మెలానియాను ట్రంప్ మూడో పెళ్లి చేసుకొని ఏడాది అయ్యింది. మెలానియా తన కుమారుడు బారెన్‌కు జన్మనిచ్చిన నాలుగు నెలలకే ట్రంప్- డానియల్ కలుసుకున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఆ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చాడు. ఈ వ్యవహారంలో ట్రంప్ లాయర్ మైఖేల్ కోహెన్ సెటిల్‌మెంట్ చేశారు. ఇది చెల్లదంటూ డానియల్ న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టును ఆశ్రయించారు. ట్రంప్ ప్రలోభాలకు గురి చేసి తనను లైంగికంగా వాడుకున్నాడని కేసు పెట్టింది. డొనాల్డ్ ట్రంప్‌కు తనతో లైంగిక సంబంధాలున్నాయని 2018, 19లో పోర్న్‌స్టార్ డానియల్ అనేక సార్లు మీడియా ముందు చెప్పింది. 34 నేరాల్లో ట్రంప్ దోషిగా తేలాడు. 2023లో కేసు విచారణ జరిగింది. శిక్ష పడుతుంది అనే సమయానికి అమెరికా ఎన్నికలు జరిగి తప్పించుకున్నాడు.
అమెరికాలో ఎలన్ మస్క్ కొత్త పార్టీ..?
అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎలన్ మస్క్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి Xలో పోస్ట్ కూడా పెట్టారు. 'కొత్త పార్టీ పెట్టవచ్చా' అంటూ అభిమానులను ప్రశ్నించారు. దీనిపై ఓటింగ్ కూడా పెట్టారు. మస్క్ పెట్టిన ఓటింగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొత్త పార్టీ పెట్టాలంటూ 80శాతం మంది మద్దతు పలికారు.
Donald Trump | 47th us president donald trump | big shock to donald trump | Elon Musk | Stormy Daniel | Jeffrey Epstein | latest-telugu-news