BJP Minister Controversy: మహిళలు పొట్టి దుస్తులు వేసుకోవద్దు.. బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. విదేశీ ఆచారమైన ఈ విధానం భారత సంప్రదాయానికి విరుద్ధమన్నారు.

New Update
I don’t like women in revealing dresses, bjp minister Vijayvargiya makes controversial remark

I don’t like women in revealing dresses, bjp minister Vijayvargiya makes controversial remark

BJP Minister Controversy: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన బీజేపీ సీనియర్ నేత(BJP Leader), మంత్రి కైలాశ్‌ విజయ్‌ వర్గీయ(Minister Kailash Vijayvargiya) గురువారం మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు పొట్టి దుస్తులు ధరించడాన్ని తాను ఒప్పుకోనని అన్నారు. విదేశీ ఆచారమైన ఈ విధానం భారత సంప్రదయానికి విరుద్ధమన్నారు. మహిళను దేవతా రూపంగా తాను చూస్తానని పేర్కొన్నారు. 

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Also Read: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ఇక వివరాల్లోకి వెళ్తే.. 

జూన్ 5న (గురువారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ క్రమంలోనే బీజేపీ మంత్రి విజయ్ వర్గీయ మాట్లాడుతూ( BJP Minister Kailash Vijayvargiya Comments on Women’s Clothing ) మహిళల వస్త్రధారణ గురించి ప్రస్తావించారు. నిండైన దుస్తులు వేసుకునే మహిళను మన దేశంలో అందానికి ప్రతిరూపంగా చూస్తామని తెలిపారు. విదేశాల్లో మహిళలు ఎంత తక్కువ దుస్తులు ధరిస్తే అంత అందంగా చూస్తారని చెప్పారు. 

Also Read: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సీక్రెట్ మ్యారేజ్.. నెట్టింట వైరల్

ఆయన చేసిన వ్యాఖ్యలకు సభలో నవ్వులు పూశాయి. అందరూ చప్పట్లతో స్పందించారు. చాలాసార్లు అమ్మాయిలు తనతో సెల్ఫీలు దిగేందుకు వస్తారని..కాని నిండుగా దుస్తులు ధరించి ఆ తర్వాత సెల్ఫీలకు రావాలని నేను వాళ్లకి చెబుతుంటానని కైలాశ్‌ విజయ్‌వర్గీయ అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Also Read: తొక్కిసలాట మృతులకు RCB భారీ పరిహారం.. ఒక్కో కుటుంబానికి

Also Read: వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. 2,200 మంది అరెస్ట్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు