HHVM: ఇట్స్ అఫీషియల్.. హరిహరవీరమల్లు మళ్ళీ వాయిదా!

ఈనెల 12న విడుదల కావాల్సిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ట్రైలర్ తో పాటు కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ ఎదురైంది.

New Update

HHVM:  పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడింది. ఈనెల 12న మూవీ విడుదల కావాల్సి ఉండగా..  పోస్ట్ ఫోన్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమాకు సంబంధించిన  వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడం వల్లే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ వర్క్ విషయంలో రాజీ పడకుండా, సినిమాను మెరుగైన అవుట్‌పుట్‌తో అందించాలని మేకర్స్ భావిస్తున్నారట. మూవీ ట్రైలర్ తో పాటు కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

దాదాపు నాలుగేళ్ళగా 

ఇప్పటికే  నాలుగు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఇప్పుడు మరోసారి వాయిదా పడడంతో అభిమానుల ఎదురుచూపులపై నీళ్లు జల్లినట్లైంది. దాదాపు నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్ .. ఇప్పటికీ విడుదలకు నోచుకోకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ''మొన్నటివరకు వరకు పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అంటూ వచ్చారు. ఇప్పుడు పవన్ షూట్ కంప్లీట్ చేసినా విడుదలకు సిద్ధంగా లేదు!'' అంటూ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సినీ ఇండస్ట్రీలో అత్యంత ఎక్కువ కాలం  షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న సినిమాల లిస్ట్ లో..  ఇప్పుడు హరిహరివీరమల్లు కూడా చేరింది. 

పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి  జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. క్రిష్ ఒక షెడ్యూల్ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. జ్యోతి కృష్ణ మిగతా షూటింగ్ పూర్తి చేశారు.  దాదాపు రూ. 200  కోట్లకు పైగా  బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో, తమిళం, కన్నడ  రిలీజ్  కానుంది. ఇందులో నిధి అగర్వాల్, బాబీ డియోల్,  నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

Also Read: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు