Lottery: లక్కీ కపుల్.. రూ.257 పెడితే - రూ.12 కోట్లు లాభం!

భార్యతో కలిసి రెస్టారెంట్‌ భోజనానికి వెళ్లిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఒక లాటరీ క్షణాల్లో అతడిని కోటీశ్వరుడిని చేసింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ కపుల్ రూ.257తో లాటరీ కొనుగోలు చేసింది. దాన్ని స్క్రాచ్ చేయగా రూ.12.86 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

New Update
Dinner Date Turns Into Rs 12.8 Crore Lottery Win For US Couple

Dinner Date Turns Into Rs 12.8 Crore Lottery Win For US Couple

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం. అది వరించిన రోజు.. వారి ఆనందానికి అవదులే ఉండవు. అలాంటి అవధుల్లేని ఆనందంలో ఇప్పుడు ఓ కపుల్ మునిగి తేలుతుంది. అవును.. మీరు విన్నది నిజమే. రెస్టారెంట్‌కి వెళ్తూ సరదాగా కొనుకున్న లాటరీ టికెట్‌ వారి జీవితాన్నే మార్చేసింది. 

క్షణంలో కోటీశ్వరులైపోయారు

ఐదు కాదు.. పది కాదు.. ఏకంగా రూ.12 కోట్లు జాక్ పాట్ కొట్టేశారు. ఈ విషయం తెలియగానే ఆ కపుల్ ఒక నిమిషం ఆశ్చర్యానికి గురయ్యారు. ఏం చేయాలో వారికి అర్థ కాలేదు. కేవలం రూ.257 లతో కొన్న లాటరీ టికెట్ క్షణాల్లో ఆ ఫ్యామిలీ జీవితాన్నే మార్చేసింది. ఇంత డబ్బు వరించిన తర్వాత ఆ జంట ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరి ఆ కపుల్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రెస్టారెంట్‌కు వెళుతున్నాడు. మధ్యలో లాటరీ టికెట్ కొనాలని అనుకున్నారు. దీంతో సరదాగా 3 డాలర్లు (రూ.257) పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నారు. ఆ తర్వాత దాన్ని స్క్రాచ్ చేయగా.. ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12.86 కోట్లు) జాక్ పాట్ తగిలింది. దీంతో ఆ జంట ఆనందంలో మునిగితేలారు. 

దీనిపై వారు మాట్లాడుతూ.. ‘‘నిజానికి లాటరీ టికెట్ అక్కడ కొనాల్సింది కాదు. మా ఇద్దరిలో ఒకరు ఇక్కడ కొందామంటే.. మరొకరు వేరే చోట కొందాం అని అనుకున్నాం. ఆ తర్వాత సర్లే ఎక్కడైతే ఏంటి? అని ఇక్కడ ఓ సారి ట్రై చేద్దాం అనుకున్నాం. అలా టికెట్ కొని స్క్రాచ్ చేశాం. అంతే ఒక్కసారిగా ధనవంతులం అయిపోయాం. 

ఇది నిజంగా చాలా అదృష్టం. ఒక్క క్షణం మా జీవితాన్ని మార్చేసింది. బిల్లులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ డబ్బుతో మా జీవితం మారిపోతుంది’’ ఆ కపుల్ ఆనందం వ్యక్తం చేసింది. ఇకపోతే ఈ మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోకుండా.. సంవత్సరానికి కొంత మొత్తాన్ని తీసుకోనున్నారు. ఇలా దాదాపు 25 ఏళ్లపాటు డ్రా చేసుకునేలా లాటరీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

 

lottery-luck | lottery | Rs 12 crore lottery | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | telugu viral news

Advertisment
Advertisment
తాజా కథనాలు