/rtv/media/media_files/2025/06/06/6JDGracQYk3hsALoigTO.jpg)
TPCC Chief Mahesh Kumar Goud
ఈ నెలలోనే పీసీసీ కొత్త కార్యవర్గం, మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ రోజు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మచ్చలేని మనిషి మీనాక్షిని తెలంగాణకుఇన్ఛార్జ్ గా నియమించడం శుభదాయకమన్నారు. పార్టీ సమర్ధవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అధికారంలో ఉన్నపుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. గ్రామ స్థాయి, బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. శక్తి వంచన లేకుండా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించామన్నారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారన్నారు. వారిని సమన్వయం చేయాల్సిన బాధ్యత నేతలందరిపై ఉందన్నారు. ఉద్యోగాలు, విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శాస్త్రీయంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజ్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. సమస్యల్ని అధిగమించే ప్రయత్నం చేయాలని.. పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు.
Follow Us