Trump-musk: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు..ట్రంప్,మస్క్ మాటల యుద్ధం

 వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలోన్ మస్క్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మస్క్ నన్ను నిరాశకు గురి చేశారు అని ట్రంప్ అంటే ఆయనొక కృతజ్ఞత లేని వ్యక్తి అని ఎలాన్ విమర్శించుకున్నారు. 

New Update
usa

Elon Musk-Donald Trump

 అమెరికాలో ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తోంది. అదే వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లు. యూఎస్ నుంచి విదేశాలకు డబ్బులు పంపించాలంటే 3.5 పన్ను కట్టాలి..ఇదే ఆ బిల్లు. అమెరికా ప్రభుత్వం రాత్రికి రాత్రే దీనికి ఆమోద ముద్ర వేసింది. దాదాపు సెనేట్ అంతా దీనికి అంగీకారం తెలిపింది. అయితే ఇన్నాళ్ళు ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వంలో ఒక ముఖ్య వక్తి ఉన్న ఎలాన్ మస్క్ తో మాత్రం గొడవలు తీసుకొచ్చింది. మస్క్ ఈ బిల్లు ప్రపోజల్ దగ్గర నుంచీ వ్యతిరేకిస్తే వస్తున్నారు. దీని వలన అమెరికా ప్రజలకే చాలా నష్టం అని వాదిస్తున్నారు. దీనిపై ట్విట్టర్ లో చాలా పోస్ట్ లను కూడా వేశారు. మస్క్ డోజ్ నుంచి తప్పుకోవడానికి ఇదే కారణం అనే టాక్ కూడా వచ్చింది. తాజాగా రెండు రోజుల నుంచి ఎలాన్ మస్క్ వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లు గురించి వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు.  ఈబిల్లు టెస్లీ మీద కూడా ప్రభావం చూపించింది. గురువారం నాస్‌డాక్‌లో టెస్లా షేర్లు 8.44% తగ్గాయి, గత రెండు-మూడు రోజుల్లో, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే ఎలోన్ మస్క్ ఈ కంపెనీ స్టాక్ 28 డాలర్లు పడిపోయింది.

ట్విట్టర్ లో మాటల యుద్ధం..

ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్, నేను మంచి సంబంధాలే కలిగి ఉన్నాము. అయితే ఇక మీదట అదే రిలేషన్ ను కొనసాగిస్తామో లేదో తెలియదు అంటూ వ్యాఖ్యానించారు. అతను నా గురించి చాలా విషయాలు మాట్లాడాడు. వ్యక్తిగతంగా నా గురించి చెడుగా ఏమీ అనలేదు. కానీ నేను చాలా నిరాశ చెందాను అన్నారు ట్రంప్. దీనిపై ఎలాన్ మస్క్ మళ్ళీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లును తనకు ఒక్కసారి కూడా చూపించలేదు. రాత్రికి రాత్రే ఆమోదించారు. దానిని ఎవరూ పూర్తిగా చదవలేదు కూడా అంటూ రాసుకొచ్చారు. అలాగే మరొక పోస్ట్ లో చమురు, గ్యాస్ సబ్సిడీలను తాకకపోయినా.. బిల్లులో EV/సోలార్ ప్రోత్సాహకాలను కొనసాగించండి అని రాసారు. 

నేను లేకపోతే ఆయన గెలిచేవారే కాదు..

నేను లేకుండా ట్రంప్ ఎన్నికల్లో కూడా గెలిచేవారు కాదని ఎలాన్ మస్క్ మరొక పోస్ట్ పెట్టారు. సభను తమ ఆధీనంలోకి తీసుకునేవారు. రిపబ్లికన్లు సెనేట్‌లో 51-49 సీట్లు కలిగి ఉండేవారు అని మస్క్ తెలిపాడు. ట్రంప్‌ను కృతజ్ఞత లేని వ్యక్తి అని అభివర్ణించారు. మొత్తానికి వన్ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లు రాజకీయమలుపు తీసుకుంది. ఇప్పటి వరకు అత్యంత సన్నిహితంగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ లమధ్య చిచ్చు పెట్టింది. 

Also Read: Russia-Ukraine: ఉక్రెయిన్ పై ప్రతీకార దాడులు మొదలెట్టిన రష్యా..ఉద్రిక్త పరిస్థితులు

Advertisment
Advertisment
తాజా కథనాలు