Japan Moon Mission Failure: చంద్రునిపై జపాన్ చేపట్టిన ప్రయోగం విఫలం

ఇటీవల జపాన్ చంద్రనిపై అడుగు పెట్టేందుకు కీలక ప్రయోగం చేపట్టింది. ఆ దేశానికి చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ 'ఐస్పేస్' చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు మూన్ మిషన్‌ను ప్రయోగించింది. కానీ ల్యాండర్‌తో కమ్యునికేషన్ తెగిపోవడంతో ఈ ప్రయోగం విఫలమయ్యింది.

New Update
Resilience spacecraft likely crashed into the moon, Ispace confirms

Resilience spacecraft likely crashed into the moon, Ispace confirms

Japan Moon Mission Failure: చంద్రుని రహస్యాలు తెలుసుకునేందుకు అనేక దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవల జపాన్ కూడా చంద్రనిపై అడుగు పెట్టేందుకు కీలక ప్రయోగం చేపట్టింది. ఆ దేశానికి చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ 'ఐస్పేస్' చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌(iSpace Moon Landing) చేసేందుకు మూన్ మిషన్‌ను ప్రయోగించింది. కానీ ఈ ప్రయోగం విఫలమయ్యింది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో 'రెసిలెన్స్‌' ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఐస్పేస్‌ ప్రకటించింది.  

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV News App Download Links: 

ఆండ్రాయిడ్(Android) వినియోగదారులు: https://t.co/B1FaPB6Zsr

IOS వినియోగదారులు: https://t.co/4nRQaLbtfv

Also Read: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ..

జూన్ 6న ఉదయం 8 గంటలకు ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఆగిపోయిందని మిషన్‌ కంట్రోలర్లు చెప్పారు. అయితే దీన్ని తిరిగి పునరుద్ధరించడం అసాధ్యమని.. అందుకే తమ ప్రయోగాన్ని ముగించినట్లు స్పష్టం చేశారు. అలాగే ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకునేందుకు ఐస్పేస్‌ వ్యవస్థాపకుడు తకేషి హకమడ వెల్లడించారు. అయితే మే నెలలో చంద్రుడి కక్ష్యలోకి జపాన్ చేపట్టిన అంతరిక్ష నౌక ప్రవేశించింది.  'మేర్ ఫ్రిగోరిస్' టార్గెట్‌ వద్ద సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు ప్లాన్ వేసింది. రెసిలెన్స్‌ కక్ష్య నుంచి గమ్యస్థానానికి వెళ్లాక మిషన్ కంట్రోలర్లు ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ పొందలేకపోయారు. దీంతో ఈ ప్రయోగం విఫలమయ్యింది.  

Also Read: ట్రంప్ తో గొడవ..టెస్లా షేర్లు ఢమాల్..రూ.13 లక్షల కోట్లు ఆవిరి

ఇదిలాఉండగా.. భారత్‌, అమెరికా, చైనా చంద్రునిపై చేపట్టిన ప్రయోగాల్లో విజయాలు సాధించాయి. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా, భారత్‌.. ఈ నాలుగు దేశాలు మాత్రమే విజయవంతంగా జాబిల్లిపై అడుగుపెట్టాయి. దీంతో జపాన్ కూడా చంద్రునిపై కాలు మోపేందుకు ప్రయత్నిస్తోంది. జపాన్‌ ఇప్పటిదాకా ఒక్కసారి మాత్రమే చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయగలిగింది. 2024లో జపాన్ ప్రయోగించిన SLIM అనే అంతరిక్ష నౌక చంద్రునిపై దిగింది. తాజాగా ఐస్పేస్‌ సంస్థ రెసిలెన్స్‌ ల్యాండర్‌తో చంద్రుని ఉత్తర భాగంలోని మేర్ ఫ్రిగోరిస్ అనే ప్రదేశంలో దిగేందుకు యత్నించి ఫెయిలయ్యింది. 

Also Read: సె*క్స్‌ కుంభకోణంలో ట్రంప్.. ఎలాన్ మస్క్‌ సంచలన ఆరోపణలు

RTV LIVE Telugu News App

 

Advertisment
Advertisment
తాజా కథనాలు