RBI Repo Rate Cut: గుడ్ న్యూస్..వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను మళ్ళీ సవరించింది. రెపో రేట్ ను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.  దీంతో వడ్డీ రేట్లు 6శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చాయి. 

author-image
By Manogna alamuru
New Update
RBI Quiz: ఆర్బీఐ క్విజ్... ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా!

RBI Repo Rate Cut

RBI Repo Rate Cut:

ఆర్బీఐ వడ్డరేట్లను వరుసగా తగ్గిస్తూ వస్తోంది. తాజాగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను సవరించింది. ఈసారి రెపో రేటును ఏకంగా 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన జారీ చేశారు. రెపో రేట్ ను 6శాతం ఉన్నది 5.50 శాతానికి తగ్గించామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో కలుపుకుంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు ఒక శాతం వరకు తగ్గింది. దీని వలన మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరనుంది. దీని కారణంగా లోన్లు తక్కువ ధరకే అందనున్నాయి. అలాగే ఈఎమ్ఐల భారం కూడా భారీగా తగ్గనుంది. 

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Advertisment
Advertisment
తాజా కథనాలు