USA: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహం

 డోజ్ నుంచి తప్పుకున్నాక ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మధ్య చెడింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్ విషయంలో మొదలైన గొడవ..ఇప్పుడు హద్దులు దాటిపోయింది. దీంతో మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. 

New Update

 ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  అమెరికాలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎలన్‌ మస్క్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. 'కొత్త పార్టీ పెట్టవచ్చా' అంటూ అభిమానులను ప్రశ్నించారు. దీనిపై ఓటింగ్ కూడా పెట్టారు.  మస్క్ పెట్టిన ఓటింగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కొత్త పార్టీ పెట్టాలంటూ 80శాతం మంది మద్దతు పలికారు. 

కొత్త పార్టీతో ట్రంప్ కు చెక్..

అమెరికాలో మేజర్ గా రెండే పార్టీలు శతాబ్ధాలుగా ఆధిపత్యంలో ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ రెండు పార్టీలకు మధ్యనే పోటీ ఉంటుంది. అసలు మూడో పార్టీ ఒకటి ఉంటుందనేది కూడా చాలా మందికి తెలీదు.  అమెరికాలో రిపబ్లికన్లు, డెమెక్రట్లదే  మొదటి నుంచీ ఆధిపత్యం.  ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ధీటుగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని మస్క్‌ కసరత్లు చేస్తున్నారు.   

ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య మాటల యుద్ధం మితి మీరుతోంది. ట్రంప్ ను అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిపించానని...కానీ ఆయనకు కృతజ్ఞత లేదని ఎలన్‌ మస్క్ ఆరోపించారు. తాను లేకుంటే రిపబ్లికన్‌ పార్టీ ఓడిపోయేదని.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారని మస్క్ అన్నారు. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కౌంటరిచ్చారు. ఎలాన్ మస్క్ లేకున్నా గెలిచేవాడినే అన్నారు. దాంతో పాటూ ఎలాన్ మస్క్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కువ చేస్తే మస్క్‌ కాంట్రాక్టులు, కంపెనీలపై ట్యాక్సులు పెంచుతాని ట్రంప్‌ హెచ్చరించారు. 

 

Also Read: Big Breaking: గుడ్ న్యూస్..వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ 

#america president donald trump #new-party #Elon Musk #today-latest-news-in-telugu
Advertisment
Advertisment
తాజా కథనాలు