🛑LIVE BREAKINGS: ఎన్టీయార్‌‌కు భారత రత్న సాధిస్తాం–సీఎం చంద్రబాబు నాయుడు

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

  • Dec 14, 2024 21:17 IST

    ఎన్టీయార్‌‌కు భారత రత్న సాధిస్తాం–సీఎం చంద్రబాబు నాయుడు

    విజయవాడలో జరిగిన ఎన్టీయార్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తారకరామం–అన్నగారి అంతరంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీయాకు భారతరత్న ఇచ్చేవరకూ పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

    ap

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/bharata-ratna-for-ntr-is-our-mission-says-cm-chandra-babu-8440823



  • Dec 14, 2024 20:58 IST

    మంచు మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. నువ్వే నా బలం అంటూ

    మంచు మనోజ్ తన తల్లికి హ్యాపీ బర్త్‌ డే చెబుతూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. అమ్మ నువ్వే నా బలం, నీకు శాంతి, ఆనందం, ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేను అన్నారు. ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్‌లో పేర్కొన్నారు.

    manoj manchu

    Also Read : https://rtvlive.com/cinema/manchu-manoj-emotional-post-on-his-mother-birthday-8440792



  • Dec 14, 2024 20:44 IST

    గ్రూప్-2 పరీక్షలు.. టీజీపీఎస్సీ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

    గ్రూప్‌-2 పరీక్షల నేపథ్యంలో టీజపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరీక్షలను 1358 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ OMR షీట్‌ను పక్కాగా చెక్ చేసుకోవాలన్నారు. అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండన్నారు. 

    group 2,,

    Also Read : https://rtvlive.com/telangana/tgpsc-chairman-burra-venkatesham-interesting-comments-on-group-2-exams-8440727



  • Dec 14, 2024 18:44 IST

    తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు

    తిరుమలలో జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. కాగా ఆ తేదీలలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

    Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/tirumala-tirupati-devasthanam-key-announcement-on-darshans-8440575



  • Dec 14, 2024 18:26 IST

    నేషనల్ అవార్డు కోసం బన్నీ కుట్ర.. జానీ మాస్టర్ కేసులోనూ కీలక పాత్ర!?

    అల్లు అర్జున్ అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అల్లు అర్జున్ అంటే పడని పలువురు రాజకీయ నాయకులు మధ్యలో జానీ మాస్టర్ కేస్ ను బయటికి తెచ్చి మరీ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

    allu arjun58

    Also Read : https://rtvlive.com/cinema/allu-arjun-arrest-controversy-latest-update-8440512



  • Dec 14, 2024 18:24 IST

    గుజరాత్‌లో రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం..మంత్రి లోకేశ్ ఫైర్!

    గుజరాత్​లోని పాటన్​లో 5 టన్నుల బరువున్న 155 ఎర్రచందనం దుంగల్ని ఏపీ రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పట్టుకున్నారు. గుజరాత్ పోలీసుల సాయంతో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందించి స్మగ్లర్లపై ఫైర్ అయ్యారు.

    Red Sanders

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/ap-police-seize-red-sandalwood-logs-worth-rs10-crore-in-gujarat-8440447



  • Dec 14, 2024 18:23 IST

    Hyderabad లో ఘోరం.. చిన్నారి ప్రాణాలు మింగేసిన హాట్ వాటర్ బ్యాగ్ !

    అల్వాల్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హాట్ వాటర్ బ్యాగ్ పగిలి.. ఆ వేడి నీరు పడడంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు విడిచాడు. చిన్నారి పై నీళ్లు పడిన వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

    hot water bag1

    Also Read : https://rtvlive.com/telangana/hyderabad/hyderabad-incident-child-dies-after-hot-water-bag-bursts-telugu-news-8440060



  • Dec 14, 2024 18:22 IST

    తెలంగాణ ద్రోహి సీఎం అయ్యాడు.. కవిత ఫైర్!



  • Dec 14, 2024 18:21 IST

    అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ సపోర్ట్‌.. బన్నీతో ఫోన్ లో మాట్లాడిన తారక్

    అల్లు అర్జున్ అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ తన సంఘీభావం తెలిపారు. ప్రస్తుతం వార్‌ 2 షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్న తారక్.. అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్.. అరెస్టు పరిణామాలపై విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.

    ntr (1)

    Also Read : https://rtvlive.com/cinema/junior-ntr-spoke-to-allu-arjun-on-the-phone-8440389



  • Dec 14, 2024 18:20 IST

    శ్రీకాకుళంలో నకిలీ నోట్ల కలకలం.. నిందితుల్లో వైసీపీ నాయకుడు!



  • Dec 14, 2024 17:25 IST

    ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్‌షాక్

    ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్‌షాక్ తగలింది. ఆయనకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు.

    DUVVADA S

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/police-served-notices-to-ysrcp-duvvada-srinivas-8440364



  • Dec 14, 2024 17:04 IST

    రవితేజ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రాజమౌళి దంపతులు.. వీడియో వైరల్

    ఎస్.ఎస్ రాజమౌళి తన సతీమణితో కలిసి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కీరవాణి కొడుకు శ్రీసింహా పెళ్లిలో వీళ్లు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

    rajamouli22

    Also Read : https://rtvlive.com/cinema/rajamouli-couples-amazing-steps-to-ravi-teja-song-video-goes-viral-8440243



  • Dec 14, 2024 16:39 IST

    ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

    ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జమిలీ ఎన్నికలు 2029కి జరుగుతాయని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. 2034లో పూర్తి స్థాయిలో బిల్లు పెట్టేలా మోదీ ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

    jamili yennikalu

    Also Read : https://rtvlive.com/national/one-nation-one-election-may-only-start-in-2034-8440213



  • Dec 14, 2024 15:17 IST

    అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన RGV.. వైరల్ అవుతున్న పోస్ట్

    అల్లు అర్జున్ అరెస్ట్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

    rgv789

    Also Read : https://rtvlive.com/cinema/rgv-responds-to-allu-arjun-arrest-post-goes-viral-8439988



  • Dec 14, 2024 15:05 IST

    ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ సీరియస్

    ప్రభుత్వ హాస్టల్స్‌లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార నాణ్యత పెంచేందుకు ఇటీవలే గురుకులాల డైట్‌ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. వారంలో 2, 3 రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

    REVANTH2

    Also Read : https://rtvlive.com/telangana/cm-revanth-reddy-serious-on-food-poisoning-incidents-in-gurukula-hostels-8439972



  • Dec 14, 2024 15:04 IST

    పెళ్లయిన 12 ఏళ్లకు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్



  • Dec 14, 2024 12:57 IST

    BREAKING: అరెస్ట్‌పై మోహన్ బాబు సంచలన ట్వీట్!

    మోహన్ బాబు సంచలన ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ రద్దయ్యిందనే వార్తలు అవాస్తామన్నారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

    Mohan Babu 1

    https://rtvlive.com/cinema/actor-mohan-babu-sensational-tweet-on-his-case-8439675



  • Dec 14, 2024 12:55 IST

    Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్న సినీ ప్రముఖులు

    జైలు నుండి శనివారం ఉదయం విడుదలైన అల్లు అర్జున్‌‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు.

    bunyyy

    https://rtvlive.com/cinema/tollywood-celebrities-queue-up-to-meet-allu-arjun-after-his-release-8439652



  • Dec 14, 2024 12:42 IST

    రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

    అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అయన కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండడంతో అతని భార్య స్నేహా రెడ్డి, పిల్లలు టెన్షన్ పడుతూ ఉన్నారట. బన్నీ ఎలా ఉన్నాడో అనే బెంగతో ఫ్యామిలీ అంతా నిద్ర, తిండి లేకుండా ఆందోళన చెందారట.

    sad mm

    https://rtvlive.com/cinema/allu-arjun-arrest-family-got-deeply-distressed-telugu-news-8439495



  • Dec 14, 2024 12:30 IST

    తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు

    అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2 కు' మరింత పబ్లిసిటీ దక్కిందని చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అరెస్టుతో 'పుష్ప2' మరో రూ. 100 కోట్లు సాధించడం ఖాయమని అంటున్నారు. పోలీసులకు మైత్రి మూవీ మేకర్స్ కృతజ్ఞతలు చెప్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    pushpa2.1

    https://rtvlive.com/cinema/allu-arjun-arrest-pushpa-2-publicity-social-media-post-viral-telugu-news-8439339

     



  • Dec 14, 2024 12:27 IST

    రెండుసార్లు మటన్.. నాలుగుసార్లు చికెన్.. వసతి గృహాల్లో కొత్త మెనూ

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రారంభం కానుంది. ఒక్కో వారం మెనూ మారుతుండగా.. నెలకు రెండుసార్లు మటన్, చికెన్ విద్యార్థులకు పెట్టనున్నారు. వీటితో పాటు ఉడికించిన గుడ్లు, బ్రేక్ టైమ్‌లో పండ్లు, మిల్లెట్ బిస్కెట్లు ఇస్తారు.

    Food Menu

    https://rtvlive.com/telangana/telangana-government-new-menu-launched-in-hostels-monthly-twice-mutton-8439472



  • Dec 14, 2024 08:55 IST

    నేను చట్టాన్ని గౌరవిస్తాను.. అరెస్ట్ పై బన్నీ ఎమోషనల్!

    చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 'జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇది అనుకోకుండా జరిగింది. నేను చట్టాన్ని గౌరవిస్తాను. రేవతి కుటుంబానికి నా సానూభూతి. నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చారు.

    allu arjun 1,https://rtvlive.com/telangana/allu-arjun-released-from-jail-key-comments-with-the-media-telugu-news-8439113



  • Dec 14, 2024 07:30 IST

    నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి బన్నీ.. కారణమేంటి?

    చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లకుండా నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి బయలు దేరారు. జూబ్లిహిల్స్‌ రోడ్ నం.45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.

    bail

    https://rtvlive.com/cinema/icon-star-allu-arjun-came-out-of-chanchalguda-jail-went-straight-to-geetha-arts-office-instead-of-going-home-8439044



  • Dec 14, 2024 06:56 IST

    BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

    చంచల్ గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు.హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు.

    1

    https://rtvlive.com/cinema/allau-arjun-bail-release-chanchalguda-jail-bunny-sandhya-theater-8439031



  • Dec 14, 2024 06:40 IST

    నేడు అల్లు అర్జున్ విడుదల..జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు!

    అల్లు అర్జున్‌కి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. ఆయన ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ సందర్భంగా ఆయన కోసం అభిమానులు జైలు దగ్గర భారీ సంఖ్యలో వేచి ఉన్నారు.

    sjW8PngLMCGTax1ew1c3

    https://rtvlive.com/cinema/tollywood-actor-allu-arjun-will-release-on-bail-today-8439020



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు