AP: ఎన్టీయార్‌‌కు భారత రత్న సాధిస్తాం–సీఎం చంద్రబాబు నాయుడు

విజయవాడలో జరిగిన ఎన్టీయార్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తారకరామం–అన్నగారి అంతరంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీయాకు భారతరత్న ఇచ్చేవరకూ పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

New Update
ap

తెలుగు జాతి ఆత్మగౌరవం, పౌరుషం అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీయారే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన 300 సినిమాల్లో నటించారు.. ప్రతీ పాత్రలో జీవించారు. ఆయనలా వైవిధ్యమైన పాత్రలు పోషించిన నటుడు మరొకరు లేరు. ఎన్టీఆర్‌ రూపంలో మనం దేవుడిని చూస్తున్నాం అంటూ మామను పొగడ్తల్లో ముంచిపడేశారు చంద్రబాబు.  

భారతరత్న సాధిస్తాం..

తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని తెలిపారు. జాతీయ భావాలతో ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు ఏపీ సీఎం. ఆయన స్ఫూర్తితో పేదరికం లేని సమాజం కృషి చేస్తామని చెప్పారు. దాంతో పాటూ ఎన్టీయార్ కు భారత రత్న ఇచ్చేరకూ పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడమంటే తెలుగు జాతిని గౌరవించడం అని చెప్పారు. 

స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌ మన కల. అది సాధించే శక్తి మనదగ్గర ఉంది. ఎన్టీయార్ కల కూడా ఇదే. దానిని సాధించే తీరుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ వజ్రోత్సవాల కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు, సినీనటి జయప్రద, నిర్మాతలు సురేష్‌బాబు, ఆదిశేషగిరిరావు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: PM Modi: 75 ఏళ్ళ రాజ్యాంగంపై మోదీ ప్రసంగం..దద్ధరిల్లిన లోక్‌సభ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు