Mohan Babu: అరెస్ట్‌పై మోహన్ బాబు సంచలన ట్వీట్!

మోహన్ బాబు సంచలన ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ రద్దయ్యిందనే వార్తలు అవాస్తామన్నారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

New Update
Mohan BABU

Mohan Babu: మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమన్న వేళ నటుడు మోహన్ బాబు సంచలన ట్వీట్ చేశారు. తాను ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ రద్దయ్యిందనే వార్తలు అవస్తవం అని  జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తన ఇంట్లో మెడికల్ కేర్‌లో ఉన్నానని చెప్పారు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.  తప్పుడు వార్తలను నమ్మకండి అని ప్రజలను కోరారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కోసం 5 ప్రత్యేక పోలీస్ బృందాల గాలింపు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి: 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ

ఇది కూడా చదవండి: రేవంత్‌-అల్లు అర్జున్‌ పబ్లిసిటీ స్టంట్‌.. కేంద్రమంత్రి షాకింగ్‌ కామెంట్‌

ఆయనపై రెండు సెక్షన్ల కింద...

సినినటుడు మంచు మోహన్‌ బాబు కుటంబ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మంచు మనోజ్‌, తన అనుచరులతో కలిసి మోహన్‌బాబు ఇంటికి గేట్లు తోసుకుంటూ వేళ్లడం, ఆ తర్వాత మోహన్‌బాబు ఓ టీవీ జర్నలిస్టుపై దాడి చేయడం సంచలనం రేపింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే జర్నలిస్టుపై దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పటికే మోహన్‌బాబుపై కేసు నమోదైంది. 

జర్నలిస్టుపై దాడి జరిగినట్లు ఆధారాలు కూడా ఉండటంతో ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్‌బాబుపై పహాడీషరీప్ పోలీసులు ముందుగా హత్యాయత్నం కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత (BNS)లోని 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల నుంచి సలహా తీసుకున్న తర్వాత తాజాగా 109 సెక్షన్ కింద కేసును మార్చారు.

ఇది కూడా చదవండి: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి

ఇది కూడా చదవండి: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు