Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంధ్యా థియేటర్ ఘటన కేసులో డిసెంబర్ 13న అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచారు. ఆయనకు సపోర్టుగా సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. ఈ కేసులో బన్నీకి బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న రాత్రి అంతా చంచల్ గూడా జైల్లో ఉన్న బన్నీ ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.
బన్నీ అరెస్టుతో పుష్ప2 కు రూ. 100 కోట్లు..
ఇది ఇలా ఉంటే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' మరింత పబ్లిసిటీ దక్కిందని, దీంతో పుష్ప రాజ్ ఖాతాలో మరో రూ. 100 కోట్లు పక్కా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. దీనికోసం మైత్రి మూవీ మేకర్స్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అరెస్టుతో అల్లు అర్జున్ కి జరిగిన నష్టమేమి లేదు.. దానికి తోడు ఆయన సినిమాకు, ఆయనకు మరింత పబ్లిసిటీ, సానుభూతి దక్కిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీనికి సంబంధించి సినీ విశ్లేషకుడు కేఆర్‌కే కూడా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
Since #AlluArjun is arrested today, So #Pushpa2 will run Housefull during second weekend also. The Police has helped #Pushpa2ThRule to earn extra ₹100cr. 🤪😁
— KRK (@kamaalrkhan) December 13, 2024
కేఆర్‌కే తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు.. "ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు అయినందుకు 'పుష్ప 2' సెకండ్ వీక్ కూడా హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. పుష్ప2 అదనంగా రూ. 100 కోట్లు సంపాదించడానికి పోలీసులు సహాయం చేశారు" అంటూ నవ్వుతున్న ఇమేజీస్ ని జోడించి ట్వీట్ చేశారు.
Also Read: అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697.. జైలులో రాత్రి ఏం చేశాడంటే?