రెండుసార్లు మటన్.. నాలుగుసార్లు చికెన్.. వసతి గృహాల్లో కొత్త మెనూ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రారంభం కానుంది. ఒక్కో వారం మెనూ మారుతుండగా.. నెలకు రెండుసార్లు మటన్, చికెన్ విద్యార్థులకు పెట్టనున్నారు. వీటితో పాటు ఉడికించిన గుడ్లు, బ్రేక్ టైమ్‌లో పండ్లు, మిల్లెట్ బిస్కెట్లు ఇస్తారు.

New Update
Food poisoning

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెనూ ప్రారంభం కానుంది. పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మెనూ మార్చింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా కొత్త మెనూ ఈ రోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నెలకు రెండు సార్లు లంచ్‌లో మటన్, నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

వారానికి ఒక్కో మెనూ..

మిగతా రోజుల్లో అయితే ఉడికించిన కోడి గుడ్లు, ఫ్రైడ్ ఎగ్ పెట్టనున్నారు. వీటితో పాటు కిచిడీ, చపాతీ, ఇడ్లీ, వడ, పూరి, బోండా, పులిహోరతో పాటు రాగిజావ, పాలు వంటివి ఇవ్వనున్నారు. బ్రేక్ సమయాల్లో ఏదైనా పండు ఇవ్వడంతో పాటు పెసర్లు, బటానీలు, మిల్లెట్ బిస్కెట్లు ఇవ్వనున్నారు. ఇలా ఒక్కో వారానికి ఒక్కో మెనూ ఉంటుంది. ఇప్పటి వరకు నెలకు ఆరుసార్లు చికెన్ పెడుతున్నారు. కానీ ఇకపై మటన్ కూడా పెట్టనున్నారు. 

ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!

ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్టళ్లలో కేవలం చికెన్ మాత్రమే పెడుతున్నారు. కానీ ఇకపై నెలలో మొదటి, మూడో ఆదివారం మధ్యాహ్నం సమయంలో బగారా రైస్, మటన్ కర్రీ విద్యార్థులకు పెట్టనున్నారు. నెలలో మొదటి, మూడో బుధవారంతో పాటు, రెండు, నాలుగో ఆదివారం బగారా రైస్‌తో పాటు చికెన్ కర్రీ వడ్డించనున్నారు. 

ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు..

నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగిన విద్యార్థుల డైట్ ఛార్జీలను మాత్రం పెంచడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారులతో కమిటీ వేసి కేవలం 15 రోజుల్లోనే నివేదిక తెప్పించుకొని ఛార్జీలు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. పోషకాహారంతో పాటు, రుచికరమైన భోజనం విద్యార్థులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులు, నిపుణులతో సమావేశాలు నిర్వహించి మెనూ ఫిక్స్ చేశారు. 

 ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు