రవితేజ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన రాజమౌళి దంపతులు.. వీడియో వైరల్

ఎస్.ఎస్ రాజమౌళి తన సతీమణితో కలిసి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కీరవాణి కొడుకు శ్రీసింహా పెళ్లిలో వీళ్లు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
rajamouli22

ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షనే కాదు డ్యాన్స్ కూడా అదరగొడతారు. ఆ మధ్య భార్యతో కలిసి వేడుకలో డ్యాన్స్‌ చేసిన అలరించిన ఆయన.. మరోసారి తనలోని డ్యాన్స్‌ టాలెంట్‌ను బయటపెట్టారు. తన సతీమణి రమా రాజమౌళితో కలిసి ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. 

Also Read :  ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

Rajamouli Couples Amazing Steps To Ravi Teja Song

దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్. ఎమ్. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా పెళ్లి వేడుకల్లో భాగంగా రాజమౌళి దంపతులు ఇలా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రాజమౌళి డ్యాన్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.

రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. 'RRR' లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'SSMB29' మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ భాగం కానున్నారు. 

Also Read :  జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్‌ సెర్చ్‌లో భాగంగా ఇటీవల ఆఫ్రికాలోని అడవుల్లో పర్యటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలు కానుంది.

Also Read : పెళ్లయిన 12 ఏళ్లకు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు