మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమన్న వేళ నటుడు మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తల్లికి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అమ్మ నువ్వే నా బలం.. నేను నీకు శాంతి, ఆనందం, ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేను అని అందులో పేర్కొన్నారు. నువ్వు నాకు అండగా నిలిచావ్ ఇది కూడా చదవండి: 90 ఏళ్ల బామ్మకు డిగ్రీ పట్టా..యువతకు ఆదర్శంగా రాబర్ట్ జర్నీ నువ్వే నన్ను ప్రతిరోజూ ఇన్‌స్పైర్ చేస్తావుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావని తెలిపారు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్‌లో పేర్కొన్నారు. పోస్ట్‌లో తన తల్లితో దిగిన ఫొటోలను మాత్రమే మంచు మనోజ్ షేర్ చేశారు. ఫొటోలో తండ్రి మోహన్‌బాబు, అన్న విష్ణు, అక్క లక్ష్మి లేని ఫొటోలను మనోజ్ షేర్ చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో రచ్చ ఇంకా కొనసాగుతోందనే చర్చ నడుస్తోంది. Happy Birthday Amma. You are the heart and soul of our family, the one whose love and kindness have always held us together through thick and thin. Your strength and grace inspire me every single day. On this special day, I wish you nothing but peace, happiness, and all the love… pic.twitter.com/1iZxJj6fqG — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 14, 2024 ఇది కూడా చదవండి: రేవంత్-అల్లు అర్జున్ పబ్లిసిటీ స్టంట్.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్ మంచు మోహన్ బాబు ట్వీట్ మరోవైపు మంచు మోహన్ బాబు ఇవాళ సంచలన ట్వీట్ చేశారు. తాను పరారీలో ఉన్నానని వస్తున్న వార్తలపై స్పందించారు. ఇందులో భాగంగా తాను ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ముందస్తు బెయిల్ రద్దయ్యిందనే వార్తలు అవస్తవం అని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తన ఇంట్లో మెడికల్ కేర్‌లో ఉన్నానని చెప్పారు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. తప్పుడు వార్తలను నమ్మకండి అని ప్రజలను కోరారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కోసం 5 ప్రత్యేక పోలీస్ బృందాల గాలింపు అని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ఆ వార్తలను ఖండించారు. ఇది కూడా చదవండి: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి కాగా గత రెండు రోజుల క్రితం వరకు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో అక్కడి వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన ఓ మీడియా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేయడంతో మరింత సంచలనం అయింది. దీంతో జర్నలిస్టుపై దాడి జరిగిన నేపథ్యంలో మోహన్‌బాబుపై కేసు నమోదైంది. Also Read: "వన్ నేషన్ వన్ ఎలక్షన్"లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..! మోహన్ బాబు పై కేసు జర్నలిస్టుపై దాడి జరిగినట్లు ఆధారాలు కూడా ఉండటంతో ఆయనకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్‌బాబుపై పహాడీషరీప్ పోలీసులు ముందుగా హత్యాయత్నం కేసు పెట్టారు. భారత న్యాయ సంహిత (BNS)లోని 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల నుంచి సలహా తీసుకున్న తర్వాత తాజాగా 109 సెక్షన్ కింద కేసును మార్చారు