/rtv/media/media_files/2024/12/14/A8HzLafHPHAnuQsc8AjO.jpg)
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజుల క్రితమే రాధికా ఆప్టే బిడ్డకు జన్మనివ్వగా.. తాజాగా ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Also Read : అల్లు అర్జున్ కపుల్‌ని చూసి ఏడ్చిన సమంత..! ఇన్స్టా పోస్ట్ వైరల్
Radhika Apte
దీంతో నెటిజన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2012 లో రాధికా ఆప్టేకి బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్ తో వివాహం జరగ్గా.. 12 ఏళ్ళ తర్వాత ఈ జంటకు సంతానం కలగడం గమనార్హం. ఇక రాధికా ఆప్టే విషయానికొస్తే.. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టింది.
Also Read : పుష్పను లోపలేసిన రియల్ షెకావత్.. బన్నీకి వీరాభిమానట!
తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్త చరిత్ర' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి అక్కడ కూడా స్టార్ డం తెచ్చుకుంది. తెలుగు, హిందీతో పాటూ మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.
Also Read : రేపటి నుంచే గ్రూప్-2 పరీక్షలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Also Read : గంటకు రూ.5 లక్షలు తీసుకున్న బన్నీ లాయర్.. మొత్తం ఎంత వసూల్ చేశాడంటే!