ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ కింద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు వెనుక గేటు నుంచి అధికారులు అతన్ని పంపించారు. అయితే జైలు నుంచి బన్నీ ఇంటికి వెళ్లకుండా నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి బయలు దేరాడు. జూబ్లిహిల్స్ రోడ్ నం.45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన మామ చంద్రశేఖర్ ఇంటికి వెళ్లాడు బన్నీ. ఎందుకంటే తన భార్య, పిల్లలు అక్కడ ఉండటంతో వెళ్లినట్లు తెలుస్తోంది. భార్య, పిల్లలతో కలిసి తన ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం.
Also Read: బన్నీకి బెయిల్ ఇచ్చిన లాయర్ ఎవరు? వామ్మో గంటకు ఇంత ఫీజు హా?
జైలు నుండి విడుదలైన
— RTV (@RTVnewsnetwork) December 14, 2024
అల్లు అర్జున్ మీడియా కంట పడకుండా చంచల్ గూడ జైలు వెనుక నుండి అల్లు అర్జున్ను విడుదల చేసిన జైలు అధికారులు@alluarjun #Hyderabad #AlluArjunReleased #AlluArjun #RTV pic.twitter.com/yhMDnoD8M8
ఇది కూడా చూడండి: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!
జైలు వెనుక గేటు నుంచి..
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్ ని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అరెస్టు పై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ లభించింది. ఈ క్రమంలో జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు
ఇది కూడా చూడండి: Kavya Kalyanram: ఆహా.. పిచ్చెక్కించే ‘బలగం’ బ్యూటీ అందాలు..
పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవగా డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ సంథ్య థియేటర్ వెళ్లాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్ కు వచ్చారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఏడేళ్ల శ్రీ తేజ్ కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఇది కూడా చూడండి: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన