నేడు అల్లు అర్జున్ విడుదల..జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు! అల్లు అర్జున్‌కి కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో.. ఆయన ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ సందర్భంగా ఆయన కోసం అభిమానులు జైలు దగ్గర భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. By Bhavana 14 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Allu Arjun:హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో ..అందుకు సంబంధించిన కేసులో అరెస్టైన సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం చంచల్ గూడ జైలు మంజీరా బ్యారక్ నుంచి విడుదల కాబోతున్నారు. ఆయన ఎప్పుడు విడుదల అవుతారా అని అభిమానులు భారీ సంఖ్యలో జైలు దగ్గరకు తరలివచ్చారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. Also Read: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..! అల్లు అర్జున్‌కి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే... 50వేల రూపాయల పూచీకత్తు చెల్లించాలని తెలిపింది. అలాగే.. దర్యాప్తు అధికారులకు సహకరించాలని, బాధితులతో ఎలాంటి సంప్రదింపులూ, ప్రలోభ పెట్టడాలు వంటివి చెయ్యకూడదు అని చెప్పింది. Also Read: అమెరికా నుంచి 18 వేల మంది భారతీయలు ఔట్ ! రాత్రంతా... కోర్టు తీర్పు కాపీని అల్లు అర్జున్ తరపు లాయర్లు రాత్రి 10 గంటలకు చంచల్ గూడ జైలు అధికారులకు ఇచ్చారు.అయితే... ఆ కాపీలో తప్పులు ఉన్నట్లు చెప్పిన జైలు అధికారులు.. కొన్ని మార్పులు చేయాలని చెప్పారు. Also Read: CM Chandra babu: అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ఆన్‌లైన్‌లో అప్పటికి కాపీ అప్‌లోడ్ కాకపోవడంతో.. ఆయన్ని శనివారం ఫార్మాలిటీస్ పూర్తి చేయించి, విడుదల చేస్తామని తెలిపారు. అయితే... రాత్రి 10.30కి ఆన్‌లైన్‌లో కాపీ అప్‌లోడ్ అయ్యింది. అల్లు అర్జున్ నిన్న రాత్రి తనకు కేటాయించిన మంజీరా క్లాస్-1 బ్యారక్‌కి వెళ్లారు. రాత్రంతా ఆయన ఆ బ్యారక్‌లోనే ఉన్నారు. అల్లు అర్జున్ విడుదల అయినప్పటికీ కూడా.. ఈ కేసు ఆయన్ని వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు దర్యాప్తు కోసం పిలిచినప్పుడు ఆయన వెళ్లాల్సి ఉంటుంది. లేదా పోలీసులు ఆయన దగ్గరకు వెళ్లి, ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. Also Read: Rahul Gandhi:సావర్కార్‌పై వ్యాఖ్యలు..రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు హైకోర్టు ఏం చెప్పింది.. అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది కేవలం నటుడు కాబట్టే 105 (B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా? అని హైకోర్టు స్పందించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని తెలిపింది. అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపైనే రుద్దలేం అని పేర్కొంది. అదే సమయంలో అర్ణబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో సుప్రీ తీర్పును న్యాయమూర్తి ప్రస్తావించారు. రెగ్యులర్ బెయిల్ కోసం అలా చేయాల్సిందే? రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలపాలని అల్లు అర్జున్ లాయర్ పేర్కొన్నారు. దీంతో ఆదేశాలు పంపిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణకు సహకరించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు సూచించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి