‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జమిలీ ఎన్నికలు 2029కి జరుగుతాయని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. 2034లో పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేలా మోదీ ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
jamili yennikalu

దేశ రాజకీయ చరిత్రలో కొత్త నాంది పలికే కొత్త బిల్లును కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినేట్ ఆమోదం తెలుపగా.. డిసెంబర్ 16న ఈ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్‌లో మెజారీ బలం ఎన్టీయే కూటమికి ఉండటంతో ఈ బిల్లు పాస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే ఆందోళన చేస్తున్నాయి. ఈ బిల్లు పాస్ అయితే జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి. 2029 లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు పూర్తి స్థాయిలో 2034లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని చర్చ కూడా జరుగుతోంది. 

Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

వెంటనే జమిలీ ఎన్నికలంటూ ఆశపడుతున్న కొన్ని పార్టీలు

ఇప్పటికే కొన్ని ప్రాంతీయ పార్టీలు వెంటనే జమిలీ ఎన్నికలు జరుగుతాయని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందగానే ప్రభుత్వాలన్నీ కూలిపోయాతాయని.. వెంటనే ఎన్నికలు జరిగిపోతాయని కొన్ని పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. అందులో తెలంగాణ బీఆర్‌ఎస్, ఏపీలో వైసీపీ ఇలాంటి జమిలీ ఎన్నికల ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు  

2034కు జమిలీ ఎన్నికలు ఎందుకంటే?

ఇప్పుడిప్పుడే జమిలీ ఎన్నికల బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చి చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఓ కీలకమైన అంశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. జమిలీ ఎన్నికలు 2034లో నిర్వహిస్తారని తెలిసింది. అప్పటి వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా చట్టాల సవరణ ఉంటుంది.

 అలాగే ఏకకాల ఎన్నికలకు భారీ మొత్తంలో ఈవీఎంలు అవసరం ఉంటుంది. ఇవి తయారు చేసేందుకు ECIL, BEL వంటి తయారీదారులకు చాలా సమయం పడుతుంది. అదే సమయంలో అవసరమైన ఈవీఎంల సంఖ్యను రెట్టింపు చేయడానికి EC రెండున్నర నుండి మూడు సంవత్సరాల వరకు అవసరం అవుతుంది. అందులో చిప్స్, ఇతర మెటీరియల్‌ల సేకరణకు ఏడెనిమిది నెలల సమయం పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్ని ప్రభుత్వాలను ఒక్కసారిగా రద్దు చేయాలి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఇదంతా జరగాలంటే చాలా సమయం పడుతుంది.

Also read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు

మెల్ల మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఇలా చూసుకుంటే 2029కి పాక్షిక జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ ఎన్నికలకు 6 నెలల ముందు, 6 నెలల తర్వాత జరిగే ఎన్నికలన్నింటినీ కలిపితే పాక్షిక జమిలీ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల నాటికి అంటే 2034 నాటికి పూర్తి స్థాయి జమిలీ ఎన్నికలకు రెడీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

గతంలో మహిళా బిల్లు మాదిరిగానే జమిలీ ఎన్నికల బిల్లు

గతంలో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించింది కానీ అది అమలయ్యే సరికి చాలా సమయం పట్టింది. నియోజకర్గాల పునర్విభజన తర్వాత అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలకూ అదే ఫార్ములా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్‌లో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్తగా 82A సెక్షన్ చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక కొత్త నిబంధన ప్రకారం.. ఆర్టికల్‌ 82 A(1)ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి రాష్ట్రపతి “నియమించిన తేదీ”ని తెలియజేస్తారని పేర్కొంది.

అదే సమయంలో 83 సెక్షన్ ప్రభుత్వాల కాలపరిమితికి సంబంధించి మారుస్తారని సమాచారం. ఆర్టికల్ 172, ఆర్టికల్ 327లో కూడా మార్పులు చేస్తారని తెలుస్తోంది. ఈ రెండూ ఎమ్మెల్యేల పదవికాలం,  ప్రజాప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన అంశాలు. వీటిలోనూ కొన్ని సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ చేయాలంటే విపక్షాల మద్దతు అవసరం ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను కలిపి జమిలీగా నిర్వహించేలా చట్టంలో చేర్చుతున్నారు. 

Also Read: తల్లి ప్రాణం తీసిన ఊయల.. మంచిర్యాలలో విషాదం

అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అనంతరం 100 రోజుల తర్వాత ఒకే ఓటర్ల జాబితాను అందించడం ద్వారా స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను సులభతరం చేయడానికి మూడవ బిల్లును కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఈ ప్రతిపాదనలను ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ సవరణలకు 50 శాతం రాష్ట్రాలు ఆమోదం అవసరం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు