BIG BREAKING: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల

చంచల్ గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు.హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు.

New Update
1

BigBreking: చంచల్ గూడ జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు.హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను వెనుక గేటు నుంచి పంపించారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్‌ ని నిన్న చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌చేశారు.

అనంతరం నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అరెస్టు పై బన్నీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్‌ లభించింది.

Also Read: నేడు అల్లు అర్జున్ విడుదల..జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు!

పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవగా డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ సంథ్య థియేటర్ వెళ్లాడు.  ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్ కు వచ్చారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, 7 ఏళ్ల శ్రీ తేజ్ కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 

Also Read: Ap : మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

 సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో నాంపల్లి కోర్టు ఆదేశాలతో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

Also Read: CM Chandra babu: అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్

రెగ్యులర్ బెయిల్ కోసం అలా చేయాల్సిందే?

రూ.50 వేల పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జైలు సూపరింటెండెంట్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లు తెలపాలని అల్లు అర్జున్ లాయర్ పేర్కొన్నారు. దీంతో ఆదేశాలు పంపిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు విచారణకు సహకరించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు సూచించింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని, సాక్ష్యులను ప్రభావితం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 

Also Read: ఈ రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే అల్లు అర్జున్..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు