అల్లు అర్జున్ అరెస్ట్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో నిన్న అరెస్ట్ అయిన బన్నీ.. నేటి ఉదయం మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యాడు. ఇదిలా ఉంటే ఈ ఘటనపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్రభుత్వ చర్యను సమర్థిస్తుంటే మరికొందరు అల్లు అర్జున్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అయితే అల్లు అర్జున్ అంటే పడని పలువురు రాజకీయ నాయకులు మాత్రం బన్నీకి తగిన శాస్తి జరిగిందని చెబుతూ మధ్యలో జానీ మాస్టర్ కేస్ ను బయటికి తెచ్చి మరీ అల్లు అర్జున్ ను టార్గెట్ చేశారు. Also Read : అల్లు అర్జున్ కపుల్‌ని చూసి ఏడ్చిన సమంత..! ఇన్‌స్టా పోస్ట్ వైరల్ జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంలో అల్లు అర్జున్ కుట్ర ఉందని, జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును ప్రకటించడం అల్లు అర్జున్ జీర్ణించుకోలేకపోయాడని ఈ క్రమంలోనే నేషనల్ అవార్డు తనకు ఒకరికి మాత్రమే ఉండాలి అన్న ఆలోచనతో కుట్ర చేశాడని, అందుకే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తో కేసులు పెట్టించి జానీ మాస్టర్ ను జైలుకు పంపించారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు జానీ మాస్టర్ జైలుకు వెళ్ళాడు కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా అంటూ? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. Also Read : "వన్ నేషన్ వన్ ఎలక్షన్"లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!