ఎర్ర చందనం స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల నిర్మూళనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే పోలీసులు అలెర్ట్ అయ్యారు. డ్రగ్స్ అమ్మడం, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడం వంటి వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లలో మార్పు రావడం లేదు. Also Read: "వన్ నేషన్ వన్ ఎలక్షన్"లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..! వారి పని వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు దొరికి కటకటాల పాలవుతున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న పలువురుని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కోలీవుడ్ హీరో సూర్య నటించిన "సింగం" మూవీ తరహాలు వేరోక రాష్ట్రం వెళ్లి అక్కడి పోలీసుల సాయంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ... ఏపీ పోలీసులు తాజాగా ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. గుజరాత్ లోని పాటన్‌లో దాదాపు 5 టన్నుల బరువున్న 155 ఎర్రచందనం దుంగల్ని ఏపీ రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఎర్ర చందనం దుంగల్ని ఏపీ నుంచి గుజరాత్ వైపుకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే గుజరాత్ పోలీసులను సంప్రదించి వారి సాయంతో ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు అరెస్టైయిన వారి నుంచి భారీ ధర పలికే ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి ధర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటితో పాటు నిందితుల నుంచి ఒక బ్రెజ్జా కారు సైతం స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన స్మగ్లర్లను గుజరాత్‌లోని పాటన్ కోర్టులో ప్రవేశ పెట్టి వారిని ట్రాన్సిట్ వారంట్‌పై ఏపీకి తరలిస్తామని టాస్క్ ఫోర్స్ డీఎస్పీ షరీఫ్ పేర్కొన్నారు. అదే సమయంలో ఎర్ర చందనం దుంగల్ని తిరుపతికి తరలిస్తామని తెలిపారు. నారా లోకేశ్ రియాక్ట్ There was a time when Red Sanders smugglers received a red carpet welcome to smuggle our precious natural wealth out of the state. Today, under the leadership of @ncbn, smuggling has not only become impossible in the state, but the Andhra Pradesh Red Sanders Anti-Smuggling Task… pic.twitter.com/lz6xJ6fT2R — Lokesh Nara (@naralokesh) December 14, 2024 Also Read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు ఈ విషయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు స్మగ్లర్లపై ఫైర్ అయ్యారు. గతంలో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. ""గతంలో మన అమూల్యమైన సహజ సంపదను రాష్ట్రం నుంచి తరలించేందుకు ఎర్రచందనం స్మగ్లర్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన సందర్భాలు ఉన్నాయి. అయితే నేడు చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రంలో స్మగ్లింగ్ అసాధ్యంగా మారడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) బృందం గుజరాత్‌లోని పటాన్ వరకు వెళ్లి పేరుమోసిన స్మగ్లర్లను పట్టుకుంది. వారి నుంచి 5 టన్నుల రెడ్ శాండర్స్‌ను స్వాధీనం చేసుకుంది. మన సహజ సంపదను కాపాడుకోవడంలో విశిష్టమైన పని చేసినందుకు ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్, RSASTF బృందానికి ధన్యవాదాలు"" అంటూ ట్వీట్ చేశారు.