allu arjun wife emotional
Allu Arjun Arrest: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అరెస్ట్ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. బన్నీ అరెస్టు ఆయన కుటుంబాన్ని, సినీ ఇండస్ట్రీ సన్నిహితులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ కేసులో నిన్న సాయంత్రమే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చినప్పటికీ.. పలు కారణాల చేత రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
రాత్రంతా నిద్రపోని భార్య, పిల్లలు..
అయితే అల్లు అర్జున్ రాత్రంతా జైల్లో ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. భార్య స్నేహారెడ్డి, పిల్లలు బన్నీ పై బెంగతో రాత్రంతా నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉన్నారట. బన్నీ వస్తాడా..? మళ్ళీ ఏదైనా అవుతుందా అని గంట గంటకు టెన్షన్ పడుతూ గడిపారట. అటు స్నేహారెడ్డి అమ్మ, నాన్నలు కూడా నిద్రాహారాలు లేకుండా బన్నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారట.
జైల్లో 14 గంటలు కూర్చొనే..
మరో వైపు అల్లు అర్జున్ కూడా రాత్రంతా చంచల్ గూడా జైల్లో నిద్ర పోకుండా 14 గంటలు పాటు కూర్చునే ఉన్నారట. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినప్పటికీ తినలేదట. రాత్రి 8 గంటల సమయంలో కేవలం టీ, స్నాక్స్ తీసుకున్నట్లు సమాచారం. బన్నీ పడుకోవడానికి కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి..సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని అతని నివాసానికి చేరుకొని.. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ''జరిగిన ఘటన దురదృష్టకరమని.. ఇది అనుకోకుండా జరిగిందని తెలిపారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చట్టం పట్ల నాకు గౌరవం ఉంది. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని చెప్పారు. అయితే డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు.
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు