Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్న సినీ ప్రముఖులు

జైలు నుండి శనివారం ఉదయం విడుదలైన అల్లు అర్జున్‌‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు.

New Update
bunyyy

Allu Arjun: సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో నటుడు అల్లు అర్జున్‌ ని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన శనివారం ఉదయం జైలు నుండి మధ్యంత బెయిల్‌ పై విడుదల అయ్యారు.

Also Read: రెండుసార్లు మటన్.. నాలుగుసార్లు చికెన్.. వసతి గృహాల్లో కొత్త మెనూ

దీంతో అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. హీరోలు, దర్శకనిర్మాతలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర సందడి వాతావారణం ఏర్పడింది.

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు

ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఇంటికి ఎవరెవరు వచ్చారంటే..చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్, రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, వంటి వారంతా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. తనకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన సినీ ప్రముఖులను అల్లు అర్జున్ సాదారంగా ఆహ్వానించి కూర్చుని మాట్లాడుతున్నారు.

Also Read: Tollywood: టాలీవుడ్‌ కి దిష్టి తగిలిందా..వివాదాల్లో సినీ ప్రముఖులు

ఇంకా సినీ ప్రముఖులు బన్నీ ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారు. శుక్రవారం బన్నీ అరెస్ట్ అయిన సమయంలో కూడా సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రాగా, మెగా బ్రదర్ నాగబాబు ఇంకా పలువురు సెలబ్రిటీలు బన్నీ ఇంటికి చేరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బన్నీ అరెస్ట్‌ పై రియాక్ట్ అయ్యారు. నాని, రష్మిక , బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వంటి వారంతా బన్నీ అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. మొత్తంగా అయితే బన్నీకి టాలీవుడ్‌ నుంచి మంచి సపోర్ట్ లభించింది.. లభిస్తోందని తెలుస్తోంది.

Also Read: Tirumala: తిరుమలలో విషాదం..నడకదారిలో హైదరాబాద్‌ భక్తుడు మృతి!

మెగాస్టార్ సతీమణి సురేఖ కూడా బన్నీని శనివారం కలిశారు. ఆ సమయంలో ఆమె చాలా భావోద్వేగానికి గురయ్యారు. అఆయన్ను పట్టుకొని కన్నీళ్లను ఆపుకుంటూ ఎమోషనల్ అయ్యారు. దీంతో బన్నీ ఆమె చేతుల్ని పట్టుకొని కూల్ చేశారు. ఆమె తల మీద నిమురుతూ ముద్దు పెట్టారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు